Sarath Babu: నటుడు శరత్ బాబు మృతిపై సోదరి కామెంట్స్..!

శరత్ బాబు అసలు పేరు సత్యం బాబు దీక్షితులు. తెలుగు సినిమా చరిత్రలో విలక్షణమైన నటుడిగా గుర్తింపు పొందిన ఆయన తెలుగుతో పాటుగా తమిళ, కన్నడ సినీ పరిశ్రమలలో నటించారు.మొత్తం 220 పైగా సినిమాలలో నటించారు. హీరోగానే కాకుండా, విలన్ గా ను అనేక సినిమాలలో శరత్ బాబు విలక్షణ పాత్రలు పోషించారు. మంచి క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ ఆయన గుర్తింపు తెచ్చుకున్నారు.

1973లో రామరాజ్యం సినిమాతో తెలుగు సినిమా పరిశ్రమలోకి ప్రవేశించిన శరత్ బాబు చాలా హిట్ సినిమాలలో నటించారు.రామరాజ్యం, కన్నె వయసు, పంతులమ్మ, అమెరికా అమ్మాయి, చిలకమ్మ చెప్పింది, నీరాజనం, సీతాకోకచిలుక, ఓ భార్య కథ, అన్వేషణ, ఇది కథ కాదు, ఆపద్బాంధవుడు వంటి ఎన్నో సినిమాలలో శరత్ బాబు తన అద్భుతమైన నటనను ప్రదర్శించారు.

ఆమదాలవలస లో జన్మించిన ఆయన పోలీస్ ఆఫీసర్ కావాలని కలలు కన్నాడు. కానీ ఆయన కళ్ళ సమస్యల వల్ల పోలీస్ కాలేకపోయాడు. అయితే గత కొద్దిరోజులుగా ఈయన ఆనారోగ్య సమస్యలతో బాధపడుతూ AMG హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఈ రోజున తుది శ్వాస విడిచినట్లు వార్తలు. వినిపిస్తున్నాయి.. ఈ విషయంపై ఆయన సోదరి సోషల్ మీడియా వేదికగా స్పందించడం జరిగింది..

గత కొద్దిరోజులుగా ఈయన అనారోగ్యంతో బాధపడుతూ మొదట బెంగళూరులోని ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు కానీ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ లోని AMG హాస్పిటల్లో చేర్పించారు.అయితే ఇతరత్రా అనారోగ్య సమస్యలు చోటు చేసుకోవడంతో ఈయన ఆరోగ్య పరిస్థితి విసమించింది అనే వార్తలు వినిపిస్తున్నాయి ఇవి ఆ వాస్తవాలు అంటూ ఆమె తెలియజేస్తోంది.

Leave a Reply