శర్వానంద్ భార్య మేకప్ లేకుంటే ఎలా ఉందో చూడండి..!

తెలుగు చిత్ర పరిశ్రమలో ఈ ఏడాది గట్టిగానే పెళ్లి బాజాలు మోగుతున్నాయి. టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లిస్టులో నుంచి యంగ్ హీరో శర్వానంద్ రీసెంట్ గానే తప్పుకున్నాడు. ఇటీవల శర్వానంద్ పెళ్లి అనే బంధంలో అడుగు పెట్టాడు. ఆంధ్రప్రదేశ్ మాజీమంత్రి బొజ్జల గోపాలకృష్ణ మనవరాలు రక్షిత రెడ్డితో ఏడడుగులు వేశాడు. ఈ నెల 3వ‌ తేదీన జైపూర్ లీలా ప్యాలస్‌లో వీరి పెళ్లి ఎంతో వైభ‌వంగా జరిగింది.

ఈ నెల 9వ తేదీన హైదరాబాద్‌లో శర్వానంద్- రక్షిత రిసెప్షన్ వేడుక కూడా ఎంతో వైభ‌వంగా నిర్వహించారు. ఈ వేడుకకు చిత్ర పరిశ్రమలో ఉన్న స్టార్ హీరోలతో పాటు పలురు రాజకీయ నాయకులు కూడా హాజరయ్యారు.పెళ్లి తర్వాత అందురు హనీమూన్ కి వెళ్తారు అనుకున్న రక్షిత, శర్వానంద్ ఇద్ద‌రు కలిసి తమ మొదటి ట్రిప్ గా తిరుమల వెళ్లి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు.

ఇక సతీ సమేతంగా శర్వానంద్ శ్రీవారిని దర్శించుకుని శ్రీవారి సేవలో తరించాడు. అనంతరం వేద పండితులచే ఆశీర్వాదం అందుకుని స్వామివారి ప్రసాదాలు అందుకున్నాడు. త్వరలోనే ఈ జెండా రెండో ట్రిప్‌గా ఫారిన్ కంట్రీస్ కి టూర్‌కి వెళ్ళనున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం శర్వానంద్ శ్రీరామ్ ఆదిత్యతో ఓ సినిమా చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే.

Leave a Reply