Rajesh Mahasena  | ఎన్నికల బరి నుంచి తప్పుకుంటున్నా మహాసేన రాజేష్‌..

allroudadda

Rajesh Mahasena  | ‘నాపై వైకాపా కార్యకర్తలు చేస్తున్న దుష్ప్రచారంతో పార్టీకి నష్టం కలగకూడదు. తెదేపా-జనసేనపై ఆ ప్రభావం పడకుండా ఉండేందుకు అవసరమైతే పోటీ నుంచి వైదొలుగుతాను’ అని డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలోని పి.గన్నవరం నియోజకవర్గం తెదేపా అభ్యర్థి మహాసేన రాజేష్‌ శనివారం ప్రకటించారు.ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గమైన పి.గన్నవరం అసెంబ్లీ స్థానానికి తెదేపా అభ్యర్థిగా ప్రకటించినప్పటి నుంచి వైకాపా శ్రేణులు సామాజిక మాధ్యమాల్లో తనపై తీవ్రస్థాయిలో దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. కాకినాడ జిల్లా ఉత్తరకంచిలోని తన నివాసంలో ఆయన మీడియాతో శనివారం మాట్లాడారు.

అంతకుముందు ఒక వీడియో విడుదల చేశారు.విషయం ఏమిటంటే.. రాజేష్ ఒకప్పుడు చాలా వీడియోలు చేశాడు. అందులో హిందూ దేవుళ్ళు, దేవతలను నోటికొచ్చినట్లు తిట్టాడు. అలాగే అగ్రవర్ణాల అమ్మాయిలను ముఖ్యంగా బ్రాహ్మణ అమ్మాయిలను ఎవరైనా లేపుకెళ్ళి పెళ్ళిచేసుకుంటే వాళ్ళకు తలా లక్షరూపాయలు బహుమానంగా ఇస్తానని ప్రకటించాడు. అలాగే చంద్రబాబు, పవన్ కల్యాణ్ ను కూడా నోటికొచ్చినట్లు తిట్టాడు.

allroudadda
allroudadda

అంతేకాకుండా కాపులనూ బూతులు తిట్టిన వీడియోలు చాలా ఉన్నాయి. రాజేష్ అంటే బయటవాళ్ళకు తెలియకపోవచ్చు కాని తూర్పుగోదావరి జిల్లాలో ముఖ్యంగా కోనసీమ జిల్లాలోని జనాలకు బాగా తెలుసు. వీళ్ళని, వాళ్ళని లేదు ఇతనికి ఎవరు గుర్తుకొస్తే వాళ్ళని బూతులు తిడుతూ వీడియోలు చేసి రెచ్చగొట్టడమే పనిగా పెట్టుకున్నాడు. బహుశా ఆ వీడియోలు చేసినప్పుడు తాను రాజకీయాల్లోకి వస్తానని, టీడీపీలో చేరుతానని, తనకు టికెట్ ఇస్తారని ఊహించుండడు. అందుకనే నోటికొచ్చినట్లు అందరినీ తిట్టాడు. అప్పట్లో చేసిన వీడియోలే ఇప్పుడు తనకు శాపంగా మారాయి.దీంతో నా వల్ల పార్టీకి నష్టం జరుగుతుందనుకుంటే ఎంతవరకైనా తగ్గడానికి సిద్ధం.

Miss India | 28 ఏళ్లకే విశ్వసుందరి మృతి.

జగన్‌రెడ్డి బారి నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాలన్న ఆలోచన తప్ప.. పదవులు కావాలని ఎప్పుడూ ఆలోచించలేదు. వివేకా హత్యకేసులో నిందితుడు అవినాష్‌రెడ్డి, సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిందితుడు అనంతబాబుకు ఏ అడ్డూ లేదు. వాళ్లు పోటీచేస్తారు. ప్రచారమూ చేస్తారు. కానీ మహాసేన రాజేష్‌ మాత్రం పోటీ చేయకూడదట. అప్పట్లో అంబేడ్కర్‌ చాలా అవమానాలు పడ్డారని పుస్తకాల్లో చదవడమే..! అలాంటి అనుభవాలు నా జీవితంలో ఇప్పుడు మళ్లీ ఎదురయ్యాయి. ఇంకా నా జాతి ఎక్కడుందో, మమ్మల్ని ఎలా అవమానిస్తున్నారో, ఎలా అణచివేయాలని ప్రయత్నిస్తున్నారో చెప్పేందుకు ఇదే నిదర్శనం. ఒకవేళ అధిష్ఠానం తప్పదంటే, పోటీచేసి గెలిచే మొట్టమొదటి నియోజకవర్గం పి.గన్నవరమే’ అని రాజేష్‌ స్పష్టం చేశారు.

Leave a Reply