Sathya Sree: జబర్దస్త్ కమెడియన్ చమ్మక్ చంద్రకి నాకు ఉన్న బంధం అదే..!

జబర్దస్త్ ప్రోగ్రాం చాలామందికి జీవితాన్ని అందించింది. అలాంటివారిలో చమ్మక్ చంద్ర కూడా ఒకరు. ఎక్కువగా ఫ్యామిలీ స్కిట్లు చేసే చమ్మక్ చంద్ర కు ప్రత్యేకంగా అభిమానులు కూడా ఉన్నారు. ముఖ్యంగా భార్యా బాధితులు చమ్మక్ చంద్ర వీడియోలు ఎక్కువగా చూస్తారని చెబుతూ ఉంటారు. ముఖ్యంగా చంద్ర టీం లో ఆయనతో పాటు సత్య శ్రీ కి కూడా అంతే క్రేజ్ లభించింది. కొన్నాళ్లు చంద్ర లేడీ గెటప్ లు వేసి ప్రేక్షకులను అలరించారు.

కానీ సత్య శ్రీ అనే అమ్మాయి నేరుగా యాక్ట్ చేసింది. చమ్మక్ చంద్ర, సత్య శ్రీలు కలిసి ఎక్కువగా భార్యాభర్తల స్కిట్లు చేయడంతో వీరు నిజంగానే రియల్ లైఫ్ భార్య భర్తలా అన్నట్లు పుకార్లు కూడా వచ్చాయి.మరొకవైపు చమ్మక్ చంద్ర జబర్దస్త్ నుంచి వెళ్లిపోవడంతో సత్య శ్రీ కూడా వెళ్లిపోయింది. ఈ క్రమంలోని వీరి మధ్య లేనిపోని అఫైర్స్ కూడా సృష్టించారు. కానీ వీరిద్దరి పుకార్లపై సత్య శ్రీ తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..

సంచలన నిజాలు బయటపెట్టింది.. అసలు విషయంలోకి వెళ్తే చమ్మక్ చంద్ర జబర్దస్త్ వీడియోల తర్వాత ఆయనతోపాటు సత్యశ్రీ కూడా ఇతర ఛానల్ కు వెళ్లింది. అక్కడ వీరి షో సక్సెస్ కాకపోయినా పర్సనల్ గా వీరిద్దరి నటన అందరిని ఆకట్టుకుంది. దీంతో మీరు ఎక్కడున్నా ఫేవర్ జంట అని అభిమానులు అంటుంటారు.ఇక వీరి మధ్య ఏదో ఉందని ప్రచారం చేశారు.. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు చూసిన సత్య శ్రీ తల్లిదండ్రుల సైతం ఆమెను అనుమానించారట.

కానీ ఆ తర్వాత సత్య శ్రీ (Satyashri)వాళ్లకు వివరించి చెప్పడంతో రిలాక్స్ అయ్యారని సమాచారం. ఇకపోతే సత్య శ్రీ మాట్లాడుతూ .. చమ్మక్ చంద్ర గురువు అంటూ క్లారిటీ ఇచ్చింది.జబర్దస్త్ వేయడానికి ప్రత్యేకంగా వ్యక్తిగత కారణాలు ఏమీ లేవు అని మా గురువు ఎక్కడుంటారో నేను అక్కడే పని చేస్తానని వివరించింది. కానీ కొందరు పనిలేని వాళ్ళే ఇలాంటి కామెంట్లు చేస్తారని.. కానీ వాటిని పట్టించుకోవద్దని సత్య శ్రీ కొంతమంది మద్దతుగా నిలుస్తున్నారు.

Leave a Reply