రైలు ప్ర‌మాదంతో అనాథలైన పిల్ల‌ల‌కు సెహ్వాగ్ ఉచిత విద్య‌..!

ఒడిశా రైలు ప్రమాదం వందలాది కుటుంబాల్లో పెను విషాదాన్ని నింపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఇప్పటివరకు 290 మంది మృత్యువాత పడగా, వందలాది మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ విషాదకర ఘటనలో అయినవారిని, ఆత్మీయులను కోల్పోయిన కోల్పయిన వారి వేదన వర్ణనాతీతంగా మారింది.

ఈ పరిస్థితులలో క‌న్న‌వాళ్ల‌ను కోల్పోయిన పిల్ల‌ల‌ను చ‌ద‌వించేందుకు టీమిండియా మాజీ దిగ్గజం వీరేంద్ర సెహ్వాగ్ ముందుకొచ్చారు. తాను నడుపుతున్న స్కూల్లో ఆ పిల్ల‌లంద‌రిని ఉచితంగా చ‌దివిస్తాన‌ని సెహ్వాగ్ ట్విట్ట‌ర్ వేదిక‌గా ప్ర‌క‌టించారు.

అలాగే “ఒడిశా రైలు ప్రమాదం గురించి తెలుసుకుని మేమంతా తీవ్ర మనోవేదనకు గురయ్యాం. ఈ దుర్ఘటనలో తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారుల పాఠశాల విద్య బాధ్యతలను తీసుకోవాలని అదానీ గ్రూప్ నిర్ణయించింది. పిల్లల భవిష్యత్తుతోపాటు బాధితుల కుటుంబాలకు భరోసా కల్పించడం మనందరి సమష్టి బాధ్యత” అని అదానీ ట్విటర్‌ వేదికగా తెలిపారు.

Leave a Reply