శాకుంతలం మూవీ రివ్యూ & రేటింగ్..?

తెలుగు చిత్ర పరిశ్రమని భారీ చిత్రాలవైపు బాటలు వేయించిన దర్శకుల్లో గుణశేఖర్ ఒకరు. ఖర్చుకు వెనకాడకుండా సినిమాని కొత్త హంగులతో ప్రేక్షకులకు చూపించాలనే తాపత్రయ పడే దర్శకుడాయన. ఇక పౌరాణికాలపై కూడా ఆయనకి మంచి పట్టుంది. కెరీర్ ఆరంభంలోనే బాల రామాయణంతో నేషనల్ అవార్డ్ అందుకున్నారు.

రుద్రమదేవి లాంటి చారిత్రత్మ చిత్రాన్ని కూడా అందించారు. రుద్రమదేవి తర్వాత హిరణ్య కశ్యప అనే మరో పౌరాణిక చిత్రం కోసం దాదాపు ఐదేళ్ళు స్క్రిప్ట్ వర్క్ చేశారు. అయితే కోవిడ్ కారణంగా అది వాయిదా పడింది. మరో పౌరాణికం కాళిదాసు ర‌చించిన సంస్కృత నాట‌కం అభిజ్ఞాన శాకుంత‌లంపై ఆయ‌న‌ ద్రుషి ప‌డింది. సమంత ప్రధాన పాత్రలో భారీ హంగులు సాంకేతికతని జోడించి ‘శాకుంత‌లం’ గా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.

కథ:

విశ్వామిత్రుని తపస్సుని భగ్నం చేయడానికి మేనక (మధుబాల)ను భూలోకానికి పంపించగా.. మేనక తన బాధ్యతను నిర్వర్తించే క్రమంలో విశ్వామిత్రుడితో ఒక్కటై బిడ్డకు జన్మనిస్తుంది. తర్వాత ఆ బిడ్డను భూమ్మీదే వదిలేసి స్వర్గానికి వెళ్లిపోతుంది. ఆ బిడ్డను చేరదీసి పెంచి పెద్ద చేస్తాడు కణ్వ మహర్షి (సచిన్ ఖేద్కర్). ఆ చిన్నారే శకుంతల (సమంత). కణ్వ మహర్షి ఆశ్రమంలో అల్లారు ముద్దుగా పెరిగి పెద్దయిన శాకుంతల.. యుక్త వయసు వచ్చాక.. తన ఆశ్రమానికి వచ్చిన దుష్యంత మహారాజు (దేవ్ మోహన్)తో ప్రేమలో పడి.. అతణ్ని గాంధర్వ వివాహం చేసుకుంటుంది. తాను రాజ్యానికి వెళ్లి తిరిగి తనను రాజ లాంఛనాలతో తీసుకెళ్తానని చెప్పి వెళ్తాడు దుష్యంతుడు. కానీ అతను ఎంతకీ తిరిగిరాడు. ఈ లోపు శకుంతల గర్భవతి అవుతుంది. నిండు చూలాలిగా దుష్యంతుడి రాజ్యానికి వెళ్లి తనను స్వీకరించాలని కోరగా.. దుష్యంతుడు ఆమె ఎవరో తెలియనట్లు వ్యవహరిస్తాడు.. అందుకు కారణమేంటి.. దుష్యంతుడి ఆ స్పందన తర్వాత శకుంతల పరిస్థితి ఏమిటి.. చివరికి ఆమె భర్తతో ఒక్కటైందా లేదా అన్నది మిగతా కథ.

నటీనటులు:

గతంలో చేసిన లేడీ ఓరియెంటెడ్ సినిమాలను తన భుజం మీద మోసింది సమంత. కానీ శాకుంతలం సినిమాను అలా మోయలేకపోయింది. ముందుగా శకుంతల పాత్రకు సమంత యాప్ట్ అనిపించలేదు. ఈ పాత్రలో ముగ్ధమనోహరమైన అందంతో.. నిండైన విగ్రహంతో కట్టిపడేసే కథానాయిక ఉండాల్సింది. మేకప్ తో ఎంత మేనేజ్ చేయాలని చూసినా.. ఆ పాత్రకు సమంత అనిపించలేదు. నటన పరంగా సమంతకు కొన్ని సన్నివేశాల్లో మంచి మార్కులే పడినా.. స్క్రీన్ ప్రెజెన్స్ దగ్గర మాత్రం కొంచెం తేడాగానే అనిపిస్తుంది. దీనికి తోడు ఆమె సొంతంగా చెప్పుకున్న డబ్బింగ్ కూడా కుదరలేదు. గ్రాంథిక టచ్ ఉన్న డైలాగులను సమంత సరిగ్గా పలకలేకపోయింది.

దుష్యంతుడి పాత్రలో దేవ్ మోహన్ మెప్పించాడు. ఇలాంటి సినిమాలకు మణిశర్మ సరైన ఎంపికే కావచ్చు కానీ.. ఆయన శాకుంతలంకు ఆశించిన స్థాయిలో న్యాయం చేయలేకపోయాడు. పాటలు ఏదో వచ్చాయి వెళ్లాయి అన్నట్లున్నాయే తప్ప.. ఏదీ వినసొంపుగా అనిపించలేదు. పాటలకు మంచి స్కోప్ ఉన్న సినిమానే అయినా.. మణిశర్మ న్యాయం చేయలేకపోయాడు. ప్రణయ గీతాల్ని కూడా మామూలుగా లాగించేశాడు. నేపథ్య సంగీతం ఓకే. శేఖర్ వి.జోసెఫ్ ఛాయాగ్రహణం బాగుంది. నిర్మాణ విలువలకు ఢోకా లేదు. సినిమాలో భారీతనం కనిపిస్తుంది. బాగానే ఖర్చు పెట్టారు. గ్రాఫిక్స్ అక్కడక్కడా కాస్త కృత్రిమంగా అనిపించినా.. పరిమిత బడ్జెట్లో బాగానే చేశారు. సాయిమాధవ్ బుర్రా సంభాషణలు బాగున్నాయి.

రేటింగ్-2/5

Leave a Reply