Shah Rukh Khan | షారుఖ్ ఖాన్ వాచ్, ధర తెలిస్తే కళ్లు తిరిగాల్సిందే..!

Shah Rukh Khan | ప‌ఠాన్ సినిమాతో నాలుగేళ్ల త‌ర్వాత బాలీవుడ్‌లోకి అదిరిపోయే రీఎంట్రీ ఇచ్చాడు స్టార్ హీరో షారుఖ్‌ఖాన్‌. స్పై యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన ఈ సినిమా ప‌ద‌హారు రోజుల్లో 887 కోట్ల‌కుపైగా క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది. ఇండియా వైడ్‌గా హ‌య్యెస్ట్ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన బాలీవుడ్ సినిమాగా షారుఖ్‌ఖాన్ ప‌ఠాన్ కొత్త రికార్డ్ క్రియేట్ చేసింది.ప్రస్తుతం జవాన్ చిత్రంతో అద్భుతమైన విజయం అందుకున్నాడు హీరో షారుఖ్ ఖాన్.

విడుదలైన మొదటి రోజే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ .. ఇప్పటివరకు దాదాపు రూ.700 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.పాన్ ఇండియా స్థాయిలో బాద్ షా ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. ఇప్పుడు భారతదేశంలోని అత్యంత సంపన్నులలో ఒకరిగా గుర్తింపు సంపాదించుకున్నారు. దాదాపు రూ.6000 కోట్ల ఆస్తి కలిగి ఉన్నారు షారుఖ్. ఇటీవల జవాన్ సక్సెస్ సెలబ్రెషన్స్ లో షారుఖ్ లుక్ అందరిని ఆకట్టుకుంది.

బ్లాక్ సూట్ లో మరింత స్టైలీష్ లుక్ లో కనిపించారు షారుఖ్. చాలా కాలం తర్వాత బాద్ షా ఖాతాలో బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ చేరాయి. పఠాన్ తో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన షారుఖ్.. ఇప్పుడు జవాన్ తో మరోసారి సత్తా చాటారు.శుక్రవారం ముంబయిలో ‘జవాన్‌’ విజయోత్సవాన్ని పురస్కరించుకుని జరిగిన ప్రెస్‌మీట్‌లో కింగ్‌ఖాన్‌ స్టైల్‌ అందరినీ ఆకట్టుకుంది. ముఖ్యంగా షారుఖ్ ధరించిన పటేక్ ఫిలిప్ వాచ్ స్పెషల్ గా నిలిచింది. ఆ వాచ్ ధర రూ.1.22 కోట్లు అని తెలుస్తోంది.

Leave a Reply