శనివారం నాడు ఇలా మీకు జరిగితే త్వరలో మీరు ధనవంతులవ్వడం పక్కా..!

మనం చేసే మంచి చెడుల ప్రకారం ఫలాలను ఇచ్చేదేవుడు శని. అందుకే శని దేవుడిని మేజిస్ట్రేట్‌ అని పిలుస్తారు. శని అనుగ్రహం ఉంటే బిచ్చగాడు కూడా బిలియనీర్ అవుతాడు. అదే శని చెడు దృష్టి పడితే ధనవంతుడు కూడా దరిద్రుడిగా మారుతాడు. ఆస్ట్రాలజీ ప్రకారం, మీరు శనివారం నాడు ఈ కింది వీటిలో దేనినైనా చూసినట్లయితే త్వరలో మీపై శనిదేవుడు వరాల జల్లు కురిపిస్తాడని అర్థం చేసుకోండి. ఆ 5 సంకేతాలు ఏంటో తెలుసుకుందాం.

బిచ్చగాడి దర్శనం: మీరు శనివారం నాడు తెల్లవారుజామున బిచ్చగాడిని చూడటం, అతడికి మీ స్తోమత మేరకు బిక్ష వేయడం శుభసంకేతంగా భావిస్తారు. అంటే శనిదేవుడు మీపై తన అనుగ్రహన్ని కురిపిస్తాడని అర్థం.స్వీపర్ ను చూడటం: మీరు శనివారం రోజున స్వీపర్ ను చూడటం మంచిదిగా భావిస్తారు. వీలైతే అతనికి సహాయం చేయడం వల్ల మీ సంపద రెట్టింపు అవుతుంది.

నల్ల కుక్క: శనివారం శని ఆలయం ముందు నల్ల కుక్క కనిపిస్తే.. అది కూడా మీకు శుభసూచకమే. ఈ రోజున ఆ నల్ల కుక్కకి రొట్టె తినిపించడం ద్వారా మీకు శని దేవుడి అనుగ్రహం లభిస్తుంది.

నల్ల కాకి: శనివారం నాడు నల్ల కాకి మీ ఇంటి ఆవరణలో నీరు త్రాగడానికి వచ్చినట్లయితే లేదా మీరు ఉంచిన నీరు త్రాగితే అది చాలా శుభ సంకేతంగా భావిస్తారు. దీంతో మీపై శనిదేవుడు అనుగ్రహం కురిపిస్తాడు.

నల్ల ఆవు: శనివారం నాడు మీరు ఏదైనా ముఖ్యమైన పని మీద వెళ్తుంటే దారిలో నల్ల ఆవు కనిపించనట్లయిచే… మీ పని ఖచ్చితంగా పూర్తవుతుందని అర్థం చేసుకోండి. అందుకే శనివారం నాడు నల్ల ఆవును తప్పనిసరిగా పూజించాలని చెబుతారు.

Leave a Reply