Ys Sharmila | నాకూ జగనన్న అంటే చాలా ఇష్టం.. కానీ అలా చెయ్యడం తప్పు కదా..

allroudadda

Ys Sharmila | ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై కాంగ్రెస్ అధ్యక్షరాలు షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబం చీలింది అంటే దానికి కారణం జగనన్ననే అంటూ షర్మిల బాంబు పేల్చింది. దీంతో షర్మిల వ్యాఖ్యలు ప్రస్తుతం ఏపీలో హాట్ టాపిక్ గా మారాయి.గురువారం కాకినాడలో కాంగ్రెస్‌ పార్టీ నేతలతో షర్మిల సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ పార్టీ తన కుటుంబాన్ని చీల్చి రాజకీయం చేస్తుందని జగన్‌ చేసిన ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు. రాష్ట్రాన్ని, తన కుటుంబాన్ని కాంగ్రెస్‌ పార్టీ చీల్చిందని జగన్‌ అరోపించారని… వైఎస్‌ కుటుంబం చీలిందంటే.. అది కేవలం జగనన్న వల్లే జరిగిందని మండిపడ్డారు. జగన్‌ వల్లే తమ కుటుంబం విడిపోయిందనడానికి దేవుడు, మా తల్లి విజయమ్మనే సాక్ష్యం అని ఆమె చెప్పారు.ఓ వ్యక్తి తన చేతిపై వేయించుకున్న జగన్ టాటూను చూపించగా.. వెరీ గుడ్ అమ్మా అంటూ షర్మిల ప్రశంసించారు.

allroudadda
allroudadda

‘నాకు కూడా జగనన్న అంటే చాలా ఇష్టం. కానీ ప్రత్యేక హోదా తాకట్టు పెట్టడం తప్పు కదా’ అని ఆమె కామెంట్ చేశారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. మరోవైపు షర్మిలను వైఎస్ వివేకా కుమార్తె సునీత ఇడుపులపాయ గెస్ట్ హౌస్‌లో కలిశారు. ఇద్దరు ముందుగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమాధి దగ్గర నివాళులు అర్పించారు. ఇరువురు సుమారు మూడుగంటలపాటు తాజా రాజకీయాలపై సుధీర్ఘ చర్చలు జరిపారు. కొద్దిరోజులుగా వైఎస్ సునీత రెడ్డి కూడా పొలిటికల్ ఎంట్రీ ఇస్తారని ప్రచారం జరుగుతోంది. షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడంతో సునీత కూడా హస్తం గూటికి చేరతారనే ప్రచారం కూడా ఉంది.

Leave a Reply