అమ్మో.. శర్వానంద్ భార్య బ్యాగ్రౌండ్ తెలిస్తే మతిపోవాల్సిందే..!

తెలుగు చిత్ర సినిమాలో చాలామంది హీరోలు పెళ్లిళ్లు చేసుకునే విషయంలో వెనకాడుతున్నారు. ముఖ్యంగా ప్రభాస్ లాంటి హీరో వయసు మీద పడుతున్నప్పటికీ పెళ్లి విషయంలో మాత్రం వెనకడుగు వేస్తున్నాడు. ఇంతకాలం ప్రభాస్ పేరు చెప్పుకున్నటువంటి కొంతమంది యువ హీరోలు సైతం పెళ్లి పీటలు ఎక్కే ప్రయత్నాలు చేస్తున్నారు.ముందుగా నిఖిల్ సిద్ధార్థ్, నితిన్ పెళ్లి పీటలు ఎక్కగా ఇప్పుడు మరో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ శర్వానంద్ కూడా పెళ్లి పీటలేకపోతున్నాడు.

దీనికి సంబంధించినటువంటి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి శర్వానంద్ Sharwanand ఇంస్టాగ్రామ్ వేదికగా తను పెళ్లి చేసుకునే అమ్మాయి పేరు రక్షిత అని మీ అందరి బ్లెస్సింగ్స్ మాకు కావాలి అంటూ పోస్ట్ చేశాడు.అయితే ఇలాంటి సందర్భంలోనే శర్వానంద్ భార్య గురించి గూగుల్ లో తెగ వెతికేస్తున్నారట. ఆమె ఏమి చదివిందని, ఎక్కడ నివసిస్తుందని ఆమె ఎడ్యుకేషన్ బ్యాగ్రౌండ్ ఏంటని ఆస్తి విలువ ఎంతని ఇలా రకరకాల ప్రశ్నలు గూగుల్లో సెర్చ్ చేస్తున్నారట.

శర్వానంద్ చేసుకోబోయే అమ్మాయి రక్షిత తెలంగాణ హైకోర్టు లాయర్ మధుసూదన్ రెడ్డి కుమార్తె. అంతేకాదు చిత్తూరు జిల్లాలకు చెందిన టిడిపి మాజీ మంత్రి దివంగత బొజ్జల గోపాల కృష్ణారెడ్డి మనవరాలు కూడా. బొజ్జల అల్లుడికి సొంత సోదరుడు మధుసూదన్ రెడ్డి. శర్వాకి Sharwanand కాబోయే మామాఈ విధంగా చూస్తే కనుక రాజకీయాల పరంగా కావచ్చు, వ్యక్తుల పరంగా కావచ్చు గొప్ప పేరు ఉన్న కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయిగానే తెలుస్తోంది.

అయితే రక్షిత రెడ్డికి వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉంటాయని వార్తలు బయటకు వస్తున్నాయి. రక్షిత రెడ్డి తండ్రి మధుసూదన్ రెడ్డి ఆయన హైకోర్టు లాయర్ కాబట్టి కూడబెట్టిన ఆస్తులు సుమారుగా కోట్లల్లోనే ఉంటాయని తెలుస్తోంది. తన తండ్రి ఆస్తితోపాటు తన తాతల తరపు ఆస్తులే కాకుండా రక్షిత రెడ్డి కూడా ఉద్యోగం చేసి బాగానే సంపాదించిందట.శర్వానంద్ చేసుకోబోయే అమ్మాయి వేల కోట్ల ఆస్తి పరురాలని తెలుస్తోంది ప్రస్తుతం ఎంగేజ్మెంట్ జరిగినప్పటికీ పెళ్లికి సంబంధించినటువంటి ఎలాంటి అప్డేట్ ఇంకా బయటికి రాలేదు.

Leave a Reply