Shoaib Malik Marriage | సానియా మీర్జాకు షాక్ .. రహస్యంగా రెండో పెళ్లి చేసుకున్న భర్త ,

allroudadda

`Shoaib Malik Marriage |`పెళ్లి కఠినమైనది, విడాకులు తీసుకోవడం కూడా కఠినమే… ఇందులో నీకు నచ్చిన కఠినమైన అంశాన్ని ఎంచుకో. స్థూలకాయం కష్టం, ఫిట్ గా ఉండడం కష్టం… నీకు నచ్చిన కష్టాన్ని ఎంచుకో. అప్పులు చేయడం కష్టం, ఆర్థిక క్రమశిక్షణతో ఉండడం కష్టం.. నీకు నచ్చిన కష్టాన్ని ఎంచుకో. భావవ్యక్తీకరణ కష్టం, భావాలను వ్యక్తీకరించకపోవడం కష్టం.. నీకు నచ్చిన కష్టాన్ని ఎంచుకో. జీవితం ఎల్లప్పుడూ పూలపాన్పులా ఉండదు, అది కఠినంగా కూడా ఉంటుంది.

కానీ మనకు నచ్చిన కష్టాన్ని ఎంచుకునే వెసులుబాటు మనకు ఉంటుంది. ఆ కష్టాన్ని తెలివిగా ఎంచుకోవాల్సి ఉంటుంది“ పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ మాలిక్ రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆయన పాక్ నటి సనా జావేద్ ను పెళ్లి చేసుకున్నట్లు సోషల్ మీడియాలో పోస్టు చేశారు. తన పెళ్లి విషయానని షోయబ్ మాలిక్ ఇన్‌స్టాలో పోస్టు చేయడంతో షోయబ్ మాలిక్ రెండో పెళ్లి చేసుకున్నట్లు అధికారికంగా వెల్లడయినట్లయింది.

అయితే టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, షోయబ్ మాలిక్ జంట గత కొంతకాలంగా విడిగానే ఉంటుంది. సానియాతో విడిపోయి… వారిద్దరికీ పెళ్లి అయిన తర్వాత కొంతకాలం బాగానే ఉన్నారు. ప్రేమించి పెళ్లి చేసుకున్నారు వారిద్దరికీ ఒక కుమారుడు కూడా కలిగారు. గతంలోనే తమ వివాహబంధంపై సానియా మీర్జా పరోక్షంగా ఎక్స్ లో తెలిపారు. 2010లో షోయబ్ మాలిక్ తో సానియా మీర్జా వివాహం అయింది. అయితే వారు ఎందుకు విడిపోయారన్నది మాత్రం తెలియరాేదు.

Leave a Reply