ఇదేం పనిరా నీచుడా.. పానీపూరీలో ఏం కలిపాడో చూడండి..!వీడియో వైరల్,

సామాజిక మాధ్యమాల్లో వచ్చే కొన్ని వైరల్ వీడియోలు దిమ్మతిరిగేలా ఉంటాయి. కొన్ని వీడియోలను చూస్తే బయట తిండి తినాలన్నా భయమేస్తుంటుంది. అయితే, వైరల్ అయ్యే కొన్ని ఫోటోలు ఫేక్ అయినా, ఇంకొన్ని వీడియోలు మాత్రం అబద్ధమని కొట్టిపారేయడానికి లేదు. మనం నమ్మలేని నిజంలో అందులో ఉంటుంది. రోజూ రోడ్డు పక్కన తినే తినుబండారాల విషయంలో ఎంతో జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాలని చాటే ఒక వీడియో తాజాగా వైరల్ అవుతోంది.

పానీపూరీ అమ్మే ఒక వ్యక్తి తన మూత్రాన్ని ఒక మగ్గులో పట్టి మసాలా పానీపూరి నీటిలో కలిపేశాడు. తనను ఎవరూ చూడటం లేదని అతను అనుకున్నాడు. అయితే ఓ వ్యక్తి మాత్రం సైలెంట్‌గా ఈ ఘటనను తన ఫోన్‌లో రికార్డు చేసి, సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు.ఈ జిగుప్స కలిగించే ఘటన గౌహతిలో జరిగినట్లు తెలుస్తోంది. వైరల్ వీడియో ప్రకారం.. ఆ వ్యక్తి తన మూత్రాన్ని పానీపూరిలో కలపడం స్పష్టంగా చూడవచ్చు.

ఈ వీడియోను చూస్తున్నవారంతా పానీపూరి వ్యక్తిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొందరు అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారట! పానీపూరి అమ్ముకునేవారంతా ఇలాంటి నీచమైన పనులు చేస్తారని కాదు ఈ ప్రబుద్ధుడి కారణంగా అందరూ మాటపడాల్సి వస్తుంది.

Leave a Reply