21 ఏళ్ల వయసులో శ్రీరాముడు ఎంత అందంగా ఉన్నారో మీరే చూడండి.

సోషల్ మీడియాలో ఒక ఫోటో ఇప్పుడు వైరల్ అవుతుంది. అదేదో పొలిటీషియన్ ,సినిమా హీరోయిన్ ఫోటోనో కాదు..ఏకంగా సత్యమార్గాన్ని చూపించిన శ్రీరాముడి ఫోటో. 21 ఏళ్ల వయసులో శ్రీరాముడు ఎలాఉన్నాడో మనకు ఈ ఫొటోలో కనిపిస్తుంది. ఏఐ తయారు చేసిన రెండు శ్రీరాముడి చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీటిలో ఒక ఫొటోలో రాముడు సాధారణంగా ఉండగా, మరో ఫొటోలో చిరునవ్వులు చిందిస్తూ ఉన్నాడు.

ఈ ఫొటోలపై ఒక యూజర్ స్పందిస్తూ..శ్రీరాముడు అంతటి అందమైన వాడు ఈ లోకంలో మరొకరు పుట్టలేదని కామెంట్ చేశాడు.మరొక నెటిజన్ .. వాల్మీకి రామాయణం రామచరితమానస తో సహా అన్ని గ్రంథాలలో అందించిన సమాచారం ప్రకారం 21 సంవత్సరాల వయసులో శ్రీరాముడు ఇలా

ఉండేవాడంటూ అందుకు సంబంధించి చిత్రాన్ని ఏఐ రూపొందించిందని పేర్కొన్నాడు.మరొకతను శ్రీరాముని మనం ఏ రూపంలో ఊహించుకుని చూస్తామో అదే రూపంలో ఆ భగవంతుడు దర్శనమిస్తాడు అని అన్నాడు. శ్రీరాముని ముఖం చంద్రునిలా కాంతివంతంగా, సౌమ్యంగా, సున్నితంగా అందంగా ఉండేదని వాల్మీకి మహర్షి రామాయణంలో చెప్పారు.

Leave a Reply