పాపం ఇలా అయిపోయిందేంటి.. శ్వేతాబసును ఇప్పుడు చూస్తే షాక్ అవుతారు..

సినిమా ఇండస్ట్రీలో కొంతమంది తారలు అలా వచ్చి.. ఇలా వెళ్ళిపోతూ ఉంటారు. చేసింది తక్కువ సినిమాలే అయిన గుర్తుండిపోయే సినిమాలు చేసి ఆకట్టుకుంటారు.. ఆ తర్వాత చాలా కాలం కనిపించకుండా సడన్ గా ఎదో ఫంక్షన్ లోనో లేక సోషల్ మీడియాలోనో దర్శనమిస్తూ ఉంటారు. అప్పటికి ఇప్పటికి గుర్తుపట్టలేనంతగా మారిపోతారు ఆ భామలు. అలా వచ్చిన వారిలో ఈ అమ్మడుకు కూడా ఒకరు. కొత్తబంగారు లోకం సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది అందాల భామ శ్వేతాబసు ప్రసాద్.

తొలి సినిమా తోనే ఆకట్టుకుంది ఈ చిన్నది.కాలేజీ స్టూడెంట్ గా నటించిన శ్వేతా అచ్చమైన తెలుగమ్మాయిలానే ఉంటుంది. ఇక మొదటి సినిమా విజయం తర్వాత ఈ అమ్మడు చాలా మందికి ఫేవెరెట్ హీరోయిన్ గా మారింది. కొత్తబంగారు లోకం సినిమా తర్వాత పలు సినిమాల్లో నటించింది ఈ చిన్నాది. కానీ ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది.ఆ తర్వాత ఒకటి రెండు సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ కూడా చేసింది. తాజాగా ఈ అమ్మడికి సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈ ఫొటోల్లో శ్వేతాను చూస్తే షాక్ అవుతారు. అసలు గుర్తుపట్టలేనంతగా మారిపోయింది ఈ భామ. అప్పట్లో బొద్దుగున్న ఈ బ్యూటీ ఇప్పుడు సన్నగా జీరో సైజ్ లోకి మారిపోయింది. శ్వేతా 2018లో తన ప్రియుడు రోహిత్ మిట్టల్‌ ను పెళ్లాడింది. ఆతర్వాత మనస్ఫర్థలు కారణంగా వీరు విడిపోయారు. ఇక ఈ అమ్మడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తన గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటూ ఉంటుంది ఈ చిన్నది.

Leave a Reply