హీరో సిద్దార్థ భార్య ముందు హీరోయిన్స్ కూడా నిజంగా బలాదూర్..!

టాలీవుడ్ లో ప్రేమ కథా చిత్రాలతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న హీరో సిద్ధార్థ్. బాయ్స్ చిత్రం ద్వారా సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టిన సిద్ధార్థ్ దాదాపు సౌత్ లో అన్ని భాషలలోనీ ప్రేక్షకులకు తెలిసిన నటుడు. తెలుగులో స్టార్ హీరో అయ్యే వరకు వెళ్లి సడన్ గా డ్రాప్ అయిపోయారు సిద్ధార్థ్. నువ్వొస్తానంటే నేనొద్దంటానా, బొమ్మరిల్లు వంటి చిత్రాలతో లవర్ బాయ్ గా సెటిలైపోయాడు. టాలీవుడ్ ఇప్పటికీ ఈ రెండు సినిమాల గురించి మాట్లాడుతూ ఉన్నారంటే సిద్ధార్థ ఈ సినిమాలలో ఎంతలా నటించాడో అర్థం చేసుకోవచ్చు. అయితే ఆయనకు వచ్చిన స్టార్ డమ్ ని ఎక్కువ రోజులు నిలబెట్టుకోలేక పోయాడు సిద్ధార్థ్.

వరుస సినిమాల ఫెయిల్యూర్స్ తో సిద్ధార్థ్ ప్రముఖంగా వెనుకబడి పోయాడు. ఇతర హీరోలు రావడం వారి సినిమాలు హిట్ కొట్టడంతో సిద్ధార్థ్ క్రమ క్రమంగా టాలీవుడ్ లో కనుమరుగై పోయాడు. అయితే పట్టువదలని విక్రమార్కుడు లాగా తమిళంలో తీసిన సినిమాలను తెలుగులో కూడా రిలీజ్ చేస్తూనే ఉన్నాడు ఈ క్రమంలోనే ఆయన గృహం అనే సినిమాతో హిట్ కొట్టాడు. తెలుగులో తిరిగి మార్కెట్ సంపాదించుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్న ఆయన సినిమాలను ప్రేక్షకులు ఆదరించడం లేదు.

ఈ నేపథ్యంలోనే ఆయనకు తెలుగులో శర్వానంద్ తో కలిసి నటించే ఛాన్స్ అందుకున్నాడు.ఆర్ఎక్స్ 100 దర్శకుడు అజయ్ భూపతి దర్శకత్వంలో మహాసముద్రం సినిమా శర్వానంద్ హీరోగా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో సిద్ధార్థ్ ప్రత్యేకమైన పాత్రలో నటిస్తున్నాడు. ఇక సిద్ధార్థ వ్యక్తిగత విషయా నికి వస్తే ఆయనకు పెళ్లి అయింది అన్న విషయం చాలా తక్కువమందికి తెలుసు ఎందుకు అంటే ఇప్పటికి ఆయన టీనేజ్ యువకుడు గానే కనిపిస్తాడు.

అయితే ఆయన సన్నిహితులకు మాత్రమే తెలుసు ఆయనకు పెళ్లయి పిల్లలు ఉన్నారని..2003వ సంవత్సరంలో న్యూఢిల్లీలో తన పొరుగింట్లో నివాసం ఉంటున్న మేఘన అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.కానీ ఏమైందో ఏమోగాని పెళ్లయిన మూడు సంవత్సరాలకే వీరిద్దరి మధ్య మనస్పర్ధలు, విభేదాలు రావడంతో విడాకులు తీసుకుని 2007వ సంవత్సరంలో విడిపోయారు. ఆమె అందం లో సిద్ధార్థ్ ఎఫైర్ నడిపిన హీరోయిన్ ల అందం ఏ మాత్రం పనికిరాదు.

Leave a Reply