స్టార్ హీరోయిన్ సిమ్రాన్ భర్త గురించి మీకు తెలుసా..!

టాలీవుడ్లో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన సిమ్రాన్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. సుమన్ హీరోగా వచ్చిన ‘అబ్బాయి గారి పెళ్లి’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ తరువాత ‘సమరసింహా రెడ్డి’ చిత్రం ఈమెను స్టార్ హీరోయిన్ ను చేసింది. అక్కడి నుండీ ఈమె వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. అప్పటి స్టార్ హీరోలైన చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ వంటి హీరోలతో రెండేసి సినిమాల వరకూ చేసింది.

మహేష్ బాబు ‘యువరాజు’ సినిమాలో కూడా హీరోయిన్ గా నటించింది ఈ బ్యూటీ.తెలుగుతో పాటు తమిళ, మలయాళం, కన్నడ భాషల్లో కూడా సినిమాలు చేసింది.నిజానికి ఈమె హిందీ సినిమాలతో కెరీర్ ను మొదలుపెట్టినప్పటికీ అక్కడ మాత్రం ఒక్క హిట్టు కూడా అందుకోకపోవడం జాలి పడాల్సిన విషయం. ఇదిలా ఉండగా… పెళ్ళైన తరువాత సినిమాలను తగ్గించిన సిమ్రాన్..

ఈమధ్య కాలంలో ‘డిటెక్టివ్’ ‘పేట’ ‘సీమరాజ’ వంటి సినిమాలతో ప్రేక్షకులను పలకరించింది. అయితే ఈమె పర్సనల్ లైఫ్ గురించి పెద్దగా ఎవ్వరికీ తెలియదు.ఈమె భర్త పేరు దీపక్ బగ్గ. ఇతను ఒక పైలట్. సిమ్రాన్ ఫ్యామిలీకి ఇతను మంచి సన్నిహితుడు.

అందుకే సిమ్రాన్ … దీపక్ ను 2003 లో పెళ్లి చేసుకుంది. వీరికి ఇద్దరు పిల్లలు. అదిత్ బగ్గ, అదీప్ బగ్గ. సిమ్రాన్ భర్త దీపక్ బగ్గ చూడడానికి చాలా హ్యాండ్సమ్ గా ఉంటాడు. వీరి ఫ్యామిలీ పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Leave a Reply