Geetha Madhuri | మళ్ళీ తల్లి కాబోతున్న సింగర్ గీత మాధురి..

Geetha Madhuri | గీతా మాధురి.. సినీ ప్రియులకు పరిచయాలు అక్కర్లేని సింగర్. తన గాత్రంతో పలు సినిమాలలో సూపర్ హిట్ సాంగ్స్ పాడిన గీతామాధురి బాహుబలి టైటిల్ సాంగ్ ద్వారా బాగా పేరుపొందింది. సినిమా పాటలతో పాటు స్టేజ్ షోలు, రియాలిటీ షోలతో మంచి పేరు సంపాదించుకున్న గీతామాధురికి తెలుగు రాష్ట్రాలలో మంచి ఫాలోయింగ్ ఉంది. గీతా మాధురి ఇప్పటివరకు తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో కలుపుకుని దాదాపు 1600 పాటలు పడింది. ప్రస్తుతం గీతా మాధురి ఇండస్ట్రీకి కాస్త దూరంగా ఉంటుంది.

అంతేకాదు పెళ్లి అయ్యాక ఈమెకి చాలావరకు అవకాశాలు తగ్గాయని చెప్పుకోవచ్చు. ఈమె 2014లో నటుడు నందుని ప్రేమ పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీరిద్దరూ ఎంతో అన్యోన్యంగా కలిసి ఉంటారు. వారి సరదా గొడవలను, అల్లరి పనులను ఈ జంట సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. అయితే గత కొంతకాలం క్రితం వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నట్లు ఊహాగానాలు వినిపించాయి.

ఇలా గతంలో కూడా చాలాసార్లు ఈ వార్తలు వచ్చాయి. కానీ వీటిని మాత్రం వారిద్దరూ లైట్ తీసుకున్నారు.నందు తాజాగా అవికా గోర్ తో కలిసి వధువు (Vadhuvu) అనే వెబ్ సిరీస్ చేశారు.ఇక ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా నందు ( Nandhu ) తమ మధ్య గొడవలు లేవని మేం కలిసే ఉంటున్నాం అని క్లారిటీ ఇచ్చారు.అయితే తాజాగా సోషల్ మీడియా ఖాతాలో గీతామాధురి (Geetha madhuri) పెట్టిన పోస్ట్ నెట్టింట్లో వైరల్ గా మారింది.

Also Read | కెప్టెన్ విజయకాంత్ చనిపోలేదు..  భార్య ప్రేమలత

https://www.allroudadda.com/
https://www.allroudadda.com/

తల్లి కాబోతున్న సింగర్ | Geetha Madhuri

గీత మాధురి తన సోషల్ మీడియా ఖాతాలో ఫిబ్రవరిలో నా కూతురు అక్క కాబోతుంది అంటూ ఒక ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టింది. అంతేకాదు ఆ పోస్ట్ కి ఫోటోలు కూడా జోడించి పెట్టింది. ఇక ఆ ఫోటోలలో గీతామాధురి బేబీ బంప్ క్లియర్ కట్ గా కనిపిస్తోంది. దాంతో గీతామాధురి తన రెండో బిడ్డకు జన్మనివ్వబోతుంది అని అందరూ క్లారిటీ కి వచ్చారు. ఇక గీత మాధురి ఆ పోస్ట్ పెట్టడంతో సెలబ్రిటీలు,అభిమానులు అందరూ ఆమెకు విషెస్ తెలుపుతున్నారు.

Leave a Reply