Singer Mangli: షాక్ సింగర్ మంగ్లీకి తీవ్ర గాయాలు..! ఆందోళనలో ఆభిమానులు,

సుమధురమైన గాత్రాంతో సంగీత ప్రేక్షకులను ఓల ఓల లాడిస్తోన్న మంగ్లీని ఏపీ ప్రభుత్వం ఎస్‌వీబీసీ ఛానెల్ సలహాదారుగా నియమించిన సంగతి తెలిసిందే.యాంకర్‌గా కెరీర్‌ మొదలెట్టిన మంగ్లీ ఇప్పుడు టాలీవుడ్‌లో బిజీయెస్ట్‌ సింగర్‌గా మారిపోయింది. శైలజారెడ్డి అల్లుడి తో సినీ ప్రస్థానం ప్రారంభించింది మంగ్లీ.

ఆతర్వాత నీది నాది ఒకే కథ, జార్జ్‌ రెడ్డి, అల వైకుంఠపురం, సిటీమార్‌, లవ్‌ స్టోరీ, రంగ్‌ దే, అల్లుడు అదుర్స్‌, క్రాక్‌, పెళ్లిసందD, పుష్ప (కన్నడ), విక్రాంత్‌ రోణ, ధమకా, మైఖేల్‌, బలగం, దాస్‌ కా ధమ్కీ వంటి హిట్‌ ల్లో పాటలు ఆలపించింది. ఇక గువ్వ గోరింక, మ్యాస్ట్రో ల్లో నటిగానూ ఆకట్టుకుంది.తాజాగా మంగ్లీకి గాయాలు అయినట్లు తెలుస్తోంది. తెలంగాణలో బోనాలు జరుగుతున్న సందర్భంగా ఓ ప్రైవేట్ సాంగ్ చిత్రీకరణలో ఆమె పాల్గొన్నారు.

అయితే షూటింగ్ సమయంలో మంగ్లీ కాలు జారి కింద పడ్డారు. దీంతో ఆమె కాలికి గాయమైంది. వెంటనే యూనిట్ సభ్యులు మంగ్లీని ఆసుపత్రికి తరలించారు. డాక్టర్లు సింగర్‌కు చికిత్స చేసి డిశ్చార్జ్‌ చేసినట్లు తెలుస్తోంది. స్వల్పగాయాలు కావడంతో మంగ్లీ త్వరగానే కోలుకుంటారని వైద్యులు తెలుపుతున్నారు. అయితే ప్రమాదమేమీ లేదని.. కాకపోతే ఖచ్చితంగా కొన్ని రోజులు బెడ్ రెస్ట్ తీసుకోవాలని వైద్యులు సూచించినట్లు సమాచారం.

Leave a Reply