పాటే కాదు.. డ్యాన్స్ కూడా దుమ్ము లేపిన సింగర్ మంగ్లీ..!మీరు చూడండి..! వైరల్ వీడియో.

తనదైన పాటలతో అశేష అభిమానులను సొంతం చేసుకున్న సింగర్ మంగ్లీ.. ఇప్పుడు ప్రజా సేవలో తరించబోతున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం (TTD)కి చెందిన శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ (SVBC) ఛానెల్ సలహాదారుగా ఆమెను నియమిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి.. ఈ సంవత్సరం మార్చిలోనే ఉత్తర్వులను జారీ చేసింది SVBC. నాలుగు రోజుల కిందట మంగ్లీ ఈ పదవీ బాధ్యతలు స్వీకరించారు.

ఈ పదవిని నిర్వహిస్తున్నందుకు మంగ్లీకి నెలకు రూ.లక్ష వేతనం ఇవ్వనున్నారు. ఆమెకు ఈ పదవిని ఇవ్వడంపై హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. మంగ్లీ మొదటి నుంచి కష్టపడి పైకొచ్చారు. బోనాల పాటలతో తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు. టాలీవుడ్‌లో ఎన్నో సినిమాలకు అద్భుతంగా పాడి.. కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఇప్పుడు ఈ పదవిలోనూ రాణించేందుకు సిద్ధమయ్యారు. ఆమెకు అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ఇకపై మంగ్లీ తిరుపతికి వచ్చినప్పుడల్లా.. వాహన, వసతి సౌకర్యాలు కల్పిస్తారు. ఐతే.. ఈ నియామకాన్ని ప్రభుత్వం గానీ, SVBC గానీ అధికారికంగా ప్రకటించకపోవడం చర్చనీయాంశం. మంగ్లీ కూడా దీనిపై స్పందించలేదు. ఐతే.. నవంబర్ 17న ఆమె తిరుమలకు వచ్చి.. రెండ్రోజులు అక్కడే ఉండి.. శ్రీవారిని దర్శించుకున్నారు. ఆ సమయంలోనే ఆమె బాధ్యతలు స్వీకరించారని తెలుస్తోంది.తాజాగా తాను చేసిన డాన్స్ వీడియో ని తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేసింది.కదా ఈ వీడియో ఇంటర్నెట్ ని షేక్ చేస్తుంది.

Leave a Reply