మూడోసారి తల్లికాబోతున్న సింగర్ సునీత..? ఒకే సారి అందరికీ షాక్ ఇచ్చిందిగా

సింగర్ సునీత పరిచయం అక్కర్లేని పేరు.. మూడు వేలకు పైగా పాటలు పడిన సునీత స్టార్ హీరోయిన్ కంటే ఎక్కువ క్రేజ్ ని సంపాదించుకుంది.. సునీత తరచూ ఇన్స్టాగ్రామ్ లో తన వీడియోస్ తో సందడి చేస్తుంది. సునీత గురించి గత కొన్ని రోజులుగా ఓ వార్త తెగ హల్‌చల్‌ చేస్తోంది. ఆమె త్వరలో తల్లి కాబోతుందన్న రూమర్లు సోషల్‌ మీడియాలో తెగ సర్క్యూలేట్‌ అవుతున్నాయి.

అయితే ఆమెపై ఇలా పుకార్లు రావడం ఇదేమీ మొదటిసారి కాదు. గతంలోనూ ఆమె ప్రెగ్నెంట్‌ అని వార్తలు పుట్టుకొచ్చాయి. వాటిని ఎప్పటికప్పుడు కొట్టిపారేస్తోన్న సునీత తాజా రూమర్లపై స్పందించింది. ‘నేను ప్రెగ్నెంటా? నాకే తెలియదే. అది ఈ రూమర్ సృష్టించిన వారి ఆలోచనా స్థాయికి సంబంధించిన విషయం.

నాకు కానీ, నా జీవితానికి కానీ సంబంధించిన విషయం మాత్రం కాదు’ అని తనపై వస్తోన్న వార్తలకు చెక్‌ పెట్టారు స్టార్‌ సింగర్‌. కాగా ఈనెల 26వ తేదీన హైదరాబాద్‌ వేదికగా మ్యాస్ట్రో ఇళయరాజా లైవ్‌ కన్సర్ట్‌ ప్రోగ్రామ్‌ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన సునీత తన ప్రెగ్నెన్సీ వార్తలను కొట్టిపారేశారు. అంతేకాదు ఈ కన్సర్ట్‌లో భాగమవుతున్నందుకు చాలా సంతోషంగా ఉందంటూ తన అభిప్రాయాలను పంచుకుంది.

Leave a Reply