Singer Sunitha | ‘నా వాళ్లే నన్ను మోసం చేశారు’… కన్నీరు పెట్టిస్తున్న సునీత మాటలు

Singer Sunitha | సింగర్ సునీత అందరికీ సుపరిచితమే. ఎన్నో అద్భుతమైన పాటలతో మన మనసులు దోచుకుందామె. లాక్ డౌన్ టైంలో ఈమె రెండో పెళ్లి చేసుకుని వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. ‘మ్యాంగో మీడియా’ అధినేత రామ్ వీరపనేనిని సునీత రెండో పెళ్లి చేసుకోవడం జరిగింది. సునీతకి ఇద్దరు పిల్లలు ఉన్న సంగతి తెలిసిందే.

ఆమెకు కొడుకు, కూతురు ఉన్నారు. ఈ క్రమంలోనే రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో తన అనుభవించిన కష్టాల గురించి పంచుకున్నారు. వ్యాపారంలో తన తండ్రికి కష్టాలు రావడం వల్ల.. 17 ఏళ్లకే కెరీర్ స్టార్ట్ చేశానని చెప్పిన సునీత.. ఆ తరువాత కొన్ని కారణాల వల్ల.. 19 ఏళ్లకే ప్రేమ వివాహం చేసుకున్నా అన్నారు. తన కెరీర్‌తో పాటు.. కుటుంబ బాధ్యతలన్నీ తన భుజాన వేసుకున్నా అని చెప్పారు.

దానికితోడు తన చుట్టూ ఉన్న వాళ్లే తనను మోసం చేశారని కాస్త ఎమోషనల్ అయ్యారు. జీవితానికి సంబంధించిన ప్రశ్నలు ఎదురైనప్పుడు నవ్వి ఊరుకునేదాన్నని..కానీ.. అందులోనూ కొంత మంది తప్పులు వెతికి విమర్శించే వారన్నారు. కొంత మంది తన బాధను అర్థం చేసుకుంటే.. మరి కొంత మంది ఫేక్ స్త్మెల్ అంటూ.. తనను కామెంట్ చేసే వారని గుర్తు చేసుకున్నారు. తన మాటలతో.. తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్‌నే కాదు.. అందర్నీ ఎమోషన్ అయ్యేలా చేస్తున్నారు ఈ స్టార్ సింగర్.

Leave a Reply