సింగర్ సునీత కూతురు ముందు హీరోయిన్స్ పనికిరారు..!

సింగర్‌ సునీత గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఏళ్లుగా తన గాత్రంతో ప్రేక్షకులను అలరిస్తున్నారు సింగర్‌​ సునీత. గాయనిగానే కాక.. డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌గా కూడా రాణిస్తున్నారు సునీత. కొన్ని ఏళ్ల క్రితం రెండో వివాహం చేసుకున్నారు సింగర్‌ సునీత. ఇక ఆమెకు మొదటి భర్త ద్వారా ఓ కుమార్తె, కుమారుడు సంతానం ఉన్నారు. కుమార్తె సింగర్‌గా రాణించే ప్రయత్నంలో ఉండగా.. కుమారుడు హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యాడు.

దర్శకేంద్రడు రాఘవేంద్రరావు నిర్మాణంలో తెరకెక్కుతోన్న సర్కార్ నౌకరి అనే చిత్రంతో అతడు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టనున్నాడు. గంగనమోని శేఖర్ ఈ ని డైరెక్ట్ చేస్తున్నాడు. ఫిబ్రవరి 6 నుంచి ఈ రెగ్యూలర్ షూటింగ్ జరుగుతుంది. ఇకపోతే సునీత కుమార్తె శ్రేయ.. కూడా తన అమ్మలాగే ఎంతో అందంగా ఉంటుంది. ప్రజంట్ విదేశాల్లో చదువుకుంటున్న శ్రేయ.. నాగచైతన్య నటించిన సవ్యసాచి లో టిక్ టిక్ టిక్ అనే పాటను పాడారు కూడా.

శ్రేయ గాత్రం కూడా చాలా బాగుంది. సంగీతం అంటే ఎంతో ఇష్టం కూడా. అమ్మ నుంచి అందాన్ని, అద్భుతమైన గాత్రాన్ని పొందిన శ్రేయ.. తర్వాతి కాలంలో సింగర్‌గా రాణిస్తుందో.. హీరోయిన్‌గా మెప్పిస్తుందో.. లేదా రెండు విభాగాల్లో దూసుకుపోతుందో చూడాలి.కాగా ఇటీవల ఫారెన్‌లో చదువుతున్న తన కుమార్తెను కలిసేందుకు వెళ్లారు సునీత. అక్కడ శ్రేయను చూసిన వెంటనే కౌగిలించుకుని ఎమోషనల్ అయ్యారు. ఆ వీడియోని ఇన్ స్టాలో షేర్ చేసింది,

Leave a Reply