సాయి పల్లవి పాటకు మహేష్ బాబు కూతురు డాన్స్ కుమ్మేసింది..! వీడియో వైరల్.

మహేష్ బాబు కూతురిగా సితార ఘట్టమనేని అందరికి పరిచయమే. కానీ తనకంటూ సొంత గుర్తింపు తెచ్చుకోవాలని ప్రతిరోజు ప్రయత్నం చేస్తుంది సితార.గతంలోనే మహేష్ భవిష్యత్తులో సితార హీరోయిన్ అవుతుందని చెప్పాడు. సితార సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తన ఫ్రెండ్ ఆద్యతో కలిసి ఓ యూట్యూబ్ ఛానల్ కూడా నడిపిస్తుంది.

ఇక సోషల్ మీడియాలో రెగ్యులర్ గా తన ఫోటోలు, వీడియోలు, ఫ్యామిలీ ఫోటోలు పోస్ట్ చేస్తూ ఫ్యాన్స్ ని ఫుల్ ఖుషి చేస్తుంది సితార.ఇటీవల క్లాసికల్ డ్యాన్స్, డ్యాన్స్ నేర్చుకుంటుంది సితార. దీంతో పలు పాటలకు స్టెప్పులు వేస్తూ ఆ వీడియోలను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది.

తాజాగా లవ్ స్టోరీ సినిమాలోని ‘సారంగదరియా’ పాటకు డ్యాన్స్‌ చేసి, ఆ వీడియోను తన ఇన్‌స్టా ఖాతాలో సితార పోస్ట్‌ చేసింది.చక్కని అభినయంతో, క్యూట్ స్టెప్పులతో అలరించింది సితార. లంగా ఓణీ ధరించి డ్యాన్స్ చేసి సాయిపల్లవిని గుర్తు చేసింది. ఈ సారంగదరియా సాంగ్‌ను సితారకు అనీ మాస్టర్‌ నేర్పించినట్లు తెలుస్తోంది. మరోవైపు పెర్ఫామెన్స్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. 4.40 లక్షల మందికిపైగా లైక్ చేయడం గమనార్హం.\

Leave a Reply