allroudadda

Sitara | తండ్రి పాటకి సితార పాప అదిరిపోయే స్టెప్స్ .. వైరల్ వీడియో..

Sitara | మహేష్ బాబుగుంటూరు కారంసినిమా మంచి విజయం సాధించినందుకు మహేష్ స్పెషల్ గా సక్సెస్ పార్టీ ఇచ్చారు. మహేష్ ఇంట్లో గుంటూరు కారం సక్సెస్ సెలబ్రేషన్స్ ని గ్రాండ్ గా చేసుకున్నారు. ఈ పార్టీకి మహేష్ ఫ్యామిలీతో పాటు, దిల్ రాజు ఫ్యామిలీ, నాగ వంశీ ఫ్యామిలీ, శ్రీలీల, మీనాక్షి చౌదరి, వంశీ పైడిపల్లి ఫ్యామిలీ.. పలువురు మహేష్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ పాల్గొన్నారు.ఆల్రెడీ గుంటూరు కారం సక్సెస్ పార్టీ ఫొటోలు వైరల్ అయ్యాయి.

అయితే ఈ పార్టీలో మహేష్ కూతురు సితార పాప స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. శ్రీలీలతో కలిసి సితార ఫుల్ ఎంటర్టైన్ అయింది. పార్టీలో వీరిద్దరూ బాగా ఎంజాయ్ చేసారని టాక్. ఇక శ్రీలీల, సితార కలిసి కొన్ని ఫొటోలు దిగారు. వాటిని సితార, శ్రీలీల సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇవి వైరల్ గా మారాయి.అది పక్కన పెడితే మహేష్-నమ్రతల గారాలాపట్టి సితార పాప సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది.

allroudadda
allroudadda

డ్యాన్స్ నేర్చుకుంటూ డ్యాన్స్ వీడియోలు షేర్ చేస్తుంటుంది. తన యాక్టివ్ నెస్ చూస్తుంటే భవిష్యత్‌లో హీరోయిగా మంచి పేరు తెచ్చుకుంటుందని అనిపిస్తూ ఉంటుంది. తన వీడియోలు చూసి మహేష్ అభిమానులు వావ్ అంటుంటారు. రీసెంట్‌గా ‘గుంటూరు కారం’ సినిమాలోని ‘ట్రిప్పింగ్..ట్రిప్పింగ్’ పాటకి సితార వేసిన స్టెప్పులు అదరహో అనిపిస్తున్నాయి.

Leave a Reply