Sobhan Babu | ఆ రోజుల్లోనే శోభన్ బాబు ఇంటికి అద్దె 150 రూపాయలట!

allroudadda

Sobhan Babu | తెలుగు సినీ ప్రేక్షకులకు ఒకప్పటి అగ్ర హీరో శోభన్ బాబు( Shobhan Babu ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.అప్పట్లో స్టార్ హీరోగా ఒక వెలుగు వెలిగారు శోభన్ బాబు.
అంతేకాకుండా అప్పట్లోనే శోభన్ బాబు బీభత్సమైన లేడీ ఫ్యాన్స్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్నారు.మరీ ముఖ్యంగా కుటుంబం కథా చిత్రాలు అన్న ఇద్దరు భార్యలు ఉండే సినిమాలు అన్న ముందుగా గుర్తుకు వచ్చేది శోభన్ బాబు అనడంలో ఎటువంటి సందేహం లేదు.

అలాంటి శోభన్ బాబును గురించి ఆయన స్నేహితుడు .. సీనియర్ నటుడు ఏచూరి చలపతిరావు ప్రస్తావించారు. శోభన్ బాబు తన ఫ్యామిలీతో కలిసి మద్రాసు వచ్చారు. ఆయన ఒక చిన్న ఇంట్లో అద్దెకి ఉండేవారు. అప్పట్లో ఆ ఇంటికి అద్దె 150 రూపాయలు. కృష్ణ మాత్రం కమెడియన్ సారథితో కలిసి ఒక రూమ్ లో ఉండేవారు. ఒక రోజున కృష్ణను శోభన్ బాబుగారే నాకు పరిచయం చేశారు.

allroudadda
allroudadda

హీరో అవుదామనే ఉద్దేశంతో ఆయన ఇండస్ట్రీకి వచ్చినట్టుగా చెప్పారు. శోభన్ బాబు – కృష్ణగారు మధ్య మంచి స్నేహం ఉండేది. ఇద్దరూ కలిసే సినిమా ఆఫీసుల చుట్టూ తిరిగేవారు. రేపటి రోజున ఎవరి ఆఫీసుకి వెళ్లాలనేది ముందురోజే మాట్లాడుకునేవారు. శోభన్ బాబు సైకిల్ పై అక్కడికి చేరుకుంటే .. కృష్ణగారు సిటీ బస్ పై అక్కడికి వెళ్లేవారు. అలా ఇద్దరూ కలిసే ఎదిగారు .. చివరివరకూ తమ స్నేహాన్ని కొనసాగించారు” అని చెప్పుకొచ్చారు.

Recent Posts

Leave a Reply