Sobhan Babu | ఎవర్ గ్రీన్ సోగ్గాడు శోభన్ బాబు మళ్లీ పుట్టాడా..?

allroudadda

Sobhan Babu | తెలుగు ఇండస్ట్రీలో ఎవర్ గ్రీన్ సోగ్గాడు శోభన్ బాబు. ఇప్పటికీ ఈయనంటే పడి చచ్చిపోయే అభిమానులున్నారు. ముఖ్యంగా లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఈయనకు ఉన్నంతగా ఎవరికీ లేదు.. ఇకపై ఎవరికీ రాదు కూడా. శోభన్ బాబు సినిమాలు వస్తే ఈ రోజుకీ టీవీల ముందు అతుక్కుపోయే ఆడవాళ్లు ఎంతోమంది ఉంటారు. అయితే ఇదంతా నాణేనికి ఒకవైపు మాత్రమే.. రెండోవైపు కూడా ఉంది.

ఈయన ఎంత పెద్ద హీరోనో అంతకంటే రెండింతలు.. కాదు కాదు పదింతలు బిజినెస్ మ్యాన్ కూడా. ఈ రోజు సౌత్ ఇండియాలో శోభన్ బాబు కంటే డబ్బున్న హీరో మరొకరు లేరు.. ఇంకా చెప్పాలంటే ఇండియాలోనే అన్ని వేల కోట్ల ఆస్తులున్న హీరో మరొకరు లేరు.అయితే అయిన కాలం చెల్లి చాలా రోజులే అవుతుంది.. తాజాగా దివంగత హీరో శోభన్ బాబుకు సంబంధించిన ఏఐ వీడియో నెట్టింట వైరలవుతుంది.

allroudadda
allroudadda

ఆర్టిఫీషియల్ టెక్నాలజీ సాయంతో ఈ వీడియోను రూపొందించినట్లుగా చూస్తుంటే అర్థమవుతుంది. సముద్రం ఒడ్డున శోభన్ బాబు చాలా స్టైలీష్‏గా.. రాయల్ గా నడుస్తూ వస్తున్నట్లుగా కనిపిస్తుంది. అందులో శోభన్ బాబు కటౌట్ హాలీవుడ్ రేంజ్‏లో కనిపిస్తుండగా.. ఏఐ టెక్నాలజీ సాయంతో శోభన్ బాబు ముఖాన్ని క్రియేట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుండగా.. సోగ్గాడు మళ్లీ ఇన్ స్టా యుగంలో జన్మిస్తే ఇలా ఉంటాడేమో అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.

Leave a Reply