100 కిలోలు బరువు తగ్గాలని టార్గెట్.. చివరికి జిమ్ చేస్తూ 21ఏళ్లకే..

అప్పటివరకు పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్లు కనపడుతున్నారు.. ఒక్కసారిగా కుప్పకూలిపోతున్నారు.. యువత అకస్మాత్తుగా గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు పెరిగిపోతున్నాయి. తాజాగా, చైనాకు చెందిన 21 ఏళ్ల కుయ్‌హువా.. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్. టిక్‌టాక్‌కు చైనీస్ వర్షన్ అయిన డౌయిన్ యాప్​లో వివిధ వీడియోలు పోస్ట్​ చేస్తూ కాస్త ఫేమస్​ అయ్యింది. డౌయిన్​లో ఆమెకు సుమారు పదివేల మంది ఫాలోవర్స్​ ఉన్నారు.

అయితే రెండు నెలల ముందు రెండు వెయిట్​ లాస్​ క్యాంపుల్లో చేరిన ఆమె 27 కిలోల బరువు తగ్గింది.ఎలా అయినా 100 కిలోల బరువు తగ్గాలనే లక్ష్యంతో షాంగ్జీ ప్రావిన్స్‌లోని ఇటీవలే ఓ వెయిట్ లాస్ క్యాంప్‌లో చేరింది. అక్కడ ఆమె అధిక తీవ్రత కలిగిన వర్కౌట్‌లను చేసింది. మంచి వ్యాయామం, విశ్రాంతి, ఆరోగ్యకరమైన ఆహారం.. ఈ మూడు నియమాలు పాటించమని శిబిరం నిర్వాహకులు చెప్పినట్లు సమాచారం.

కానీ ఆమె మాత్రం ఆహారాన్ని పరిమితంగా తీసుకుందని వార్తలు వస్తున్నాయి.మొలకెత్తిన ధాన్యాలు, క్యాబేజీ, గుడ్లు, పండ్లు మాత్రమే తీసుకునేదని పేర్కొంది. ఉదయంతోపాటు సాయంత్రం కూడా వర్కౌట్‌లు చేసేదని తెలిపింది. ఆమె 90 కిలోల బరువు తగ్గాలని.. వెయిట్ లాస్ క్యాంప్‌లో చేరింది. మొదటి ఆరు నెలల్లోనే 36 కిలోల బరువు తగ్గిందని వివరించింది. అందులో 25 కిలోలు.. మొదటి 2 నెలల్లోనే తగ్గిందని వెల్లడించింది.

దీంతో జిమ్ కోచ్‌ల భద్రతా ప్రమాణాలపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అతి వేగంగా బరువు తగ్గడం.. గుండె మీద ప్రభావం చూపుతుందని మండిపడుతున్నారు. ఒకసారి అతి తీవ్రమైన వర్కౌట్లు చేస్తే.. మోకాళ్లు, గుండె తట్టుకోలేవని కొందరు ఆక్షేపిస్తున్నారు. దీనివల్ల ఆకస్మిక మరణం సంభవిస్తుందని హెచ్చరిస్తున్నారు. ఎలాంటి నాలెడ్జ్ లేకుండానే జిమ్ కోచ్‌లు.. క్యాంప్‌కు వచ్చేవారితో ఇష్టం వచ్చినట్లు వర్కౌట్లు చేయిస్తున్నారని విమర్శించారు.

Leave a Reply