పాపం మండపంలోనే చెప్పుతో కొట్టిన మామ.. వైరల్ వీడియో..!

వివాహం అనేది ప్రతిఒక్కరికీ తీపి గుర్తు.. వేదమంత్రాల సాక్షిగా పెద్దలు, బంధుమిత్రుల ఆశీర్వాదంతో వివాహబంధంతో ఒక్కటవుతారు. సాధారణంగా పెళ్లి అంటే అబ్బాయి తరుపు వారు ఆధిపత్యం చెలాయిస్తుంటారు.. వారికి మర్యాదలు ఏమాత్రం తగ్గినా రచ్చ రచ్చ చేస్తుంటారు. కొన్నిసార్లు అదనపు కట్నం, పెట్టుపోతల సమయంలో అమ్మాయి తరుపు వారిని ఇబ్బందులకు గురి చేస్తుంటారు.

తాజాగా ఓ పెళ్లి మండపంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. పెళ్లి మండపంలోనే పెళ్లికొడుకును మామ చెప్పుతో పిచ్చి కొట్టుడు కొట్టాడు. అల్లుడు వద్దు బాబోయ్ అంటూ బ్రతిలాడాడు. దీంతో అక్కడ ఉన్న బంధుమిత్రులు అంతా షాక్ తిన్నారు.పెళ్లిపీటలపై కొత్త అల్లుడిని చెప్పుతో కొట్టడానికి అంతపెద్ద కారణం ఏంటా అని అందరూ ఆశ్చర్యపోయారు.

అల్లుడు ఏమైనా చేయకూడని తప్పు చేశాడా? కొంపతీసి అల్లుడి సీక్రేట్స్ ఏమైనా బయటపడ్డాయా? అందుకు మామ కోపంతో అల్లుడిపై చెప్పుతో దాడి చేశాడా? అన్న అనుమానాలు వచ్చాయి. అయితే మామ అల్లుడిపై దాడి చేయడానికి అసలు కారణం ఏంటంటే..

పెళ్లికొడుకు అదనంగా బైక్ కావాలంటూ కోరడం. అప్పటికే కట్నకానుకలు, పెళ్లి ఖర్చులతో సతమతమవుతున్న మామకు అల్లుడి గొంతెమ్మ కోరిక వినడంతో చిర్రెత్తుకొచ్చి కొత్త అల్లుడికి చెప్పుతో సన్మానం చేసి తన కోపాన్ని చల్లార్చుకున్నాడు. ఈ సంఘటన అక్కడ ఉన్న కొంతమంది సెల్ ఫోన్ లో బంధించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది.

Leave a Reply