Sonusood : సోనూసూద్ గురించి ఎవరికి తెలియని 5 విషయాలు..!

సోనూసూద్ గురించి 5 ఆసక్తికర విషయాలను ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.

సోనూసూద్ 23 సంవత్సరాలకే పెళ్లి చేసుకున్నారు. సోనాలి అనే ఒక యువతిని ఆయన పెళ్లి చేసుకున్నారు. కళ్లాకర్ అనే తమిళ సినిమాతో ఆయన సినీ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. సినీ బ్యాక్ గ్రౌండ్ లేకపోవడంతో ఆయన కెరీర్ తొలినాళ్ళలో బాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక్క అవకాశం కూడా దక్కించుకోలేక పోయారు. ఆయన ఆరుగురుతో కలిసి ఒకే రూమ్ లో ఉంటూ సినిమా అవకాశాల కోసం ప్రయత్నించేవారు.

ప్రముఖ హాలీవుడ్ యాక్టర్ సిల్వెస్టర్ స్టాలోన్ అంటే సోనూసూద్ కి చాలా ఇష్టం. ఆయనను ఇష్టపడటం ప్రారంభించిన తర్వాతే సోనూ జిమ్ కి వెళ్ళడం ప్రారంభించారు. బాగా కష్టపడి సిక్స్ ప్యాక్ బాడీని పెంచారు. ఇప్పటికీ ఆయన కఠోరమైన వ్యాయామాలు చేస్తూనే ఉంటారు. అందుకే దాదాపు 50 ఏళ్ల వయసు వచ్చినా.. యువకుడి లాగానే కనిపిస్తున్నారు. బాడీ పెంచడం మాత్రమే కాదు ఆయన కిక్ బాక్సింగ్ కూడా నేర్చుకున్నారు. జాకీచాన్ తో సోనూకి మంచి పరిచయాలున్నాయి.

సోనూసూద్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. ఆయనకు ధూమపానం,మద్యపానం లాంటి చెడు అలవాట్లు లేవు. ఆరోగ్యం పాడవుతుందని ఆయన అన్ని చెడు అలవాట్లకు దూరంగా ఉన్నారు. ఆయన ఎక్కువగా పార్టీలకు కూడా వెళ్లరు. ఖాళీ సమయం దొరికితే కుటుంబ సభ్యులతో గడుపుతారు.

ఉత్తమ విలన్ గా అవార్డు అందుకున్న తొలి బాలీవుడ్ యాక్టర్ సోనూసూద్ కావడం విశేషం. అరుంధతి సినిమాకు ఆయనకు అవార్డు లభించింది.

సోనూసూద్ ఎటువంటి వివాదాల్లో చిక్కుకోలేదు. కెరీర్ మొత్తంలో ఆయనపై చిన్న మచ్చ కూడా పడలేదు. కరోనా సమయంలో రియల్ హీరోగా మారిన సోనూ తన సొంత హోటల్స్ ని సైతం క్వారంటైన్ సెంటర్లుగా మార్చారు.

Leave a Reply