అరుంధతి సినిమా కోసం సోనూసూద్ అప్పట్లోనే ఎంత పారితోషకం తీసుకున్నాడో తెలుసా..!

సూపర్ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన అనుష్క.. విక్రమార్కుడు సినిమాతో మొదటి విజయం అందుకొంది. అయితే అప్పటి వరకు కమర్షియల్ హీరోయిన్‌గా ఉన్న ఈమె.. ఒక్కసారిగా లేడీ సూపర్ స్టార్ అయిపోయేలా హెల్ప్ చేసిన సినిమా అరుంధతి. 2009 జనవరి 16న విడుదలైన ఈ సినిమాకు దివంగత కోడి రామకృష్ణ దర్శకుడు. అప్పటి వరకు అందాల ఆరబోతతో గ్లామర్ హీరోయిన్‌గా వరుస సినిమాలతో బిజీగా ఉన్న అనుష్క.. సీనియర్ దర్శకుడు కోడి రామకృష్ణ చెప్పిన కథ నచ్చి..

ఆయన విజన్ కు మెచ్చి అరుంధతి సినిమాకు సైన్ చేసింది.అరుంధ‌తి సినిమాకు ముందు కోడి రామకృష్ణ సినిమాలు కూడా పెద్దగా ఆడలేదు. మరోవైపు శ్యాం ప్రసాద్ రెడ్డి నిర్మాతగా కొన్నేళ్లుగా డౌన్ ఫాల్ చూస్తున్నాడు. అలాంటి సమయంలో భారీ విజువల్ వండర్‌కు శ్రీకారం చుట్టారు. ఎలాంటి అంచనాలు లేకుండా సైలెంట్‌గా అరుంధతి మొదలైంది. ఈ సినిమా విడుదలయ్యే వరకు కూడా అంతటి ఘన విజయం సాధిస్తుందని ఎవరూ అనుకోలేదు.

స్టార్ హీరోల సినిమాలకు కూడా సాధ్యం కాని రీతిలో అరుంధతి సినిమా వసూళ్ల ప్రభంజనం సృష్టించింది. 13 ఏళ్ల కింద ఏకంగా రూ.35 కోట్ల షేర్ వసూలు చేసి అప్పటి టాలీవుడ్ టాప్ 5 సినిమాల్లో చోటు సంపాదించింది.అయితే ఈ సినిమా కోసం సోనూసూద్ అందుకున్న రెమ్యూనరేషన్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారుతున్నది.

అరుంధతి సినిమాను కోడి రామకృష్ణ ఒళ్ళు గగుర్పొడిచే సన్నివేశాలతో తెరకెక్కించారు. ఈ సినిమాలో గ్రాఫిక్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా సోనూసూధ్ డైలాగులు ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండడం తో పాటు ఇప్పటికీ ఈ డైలాగులు ఫేమస్ అవుతూనే ఉన్నాయి. ఇక ఈ సినిమా కోసం సోనుసూద్ అందుకున్న రెమ్యూనరేషన్ ఎంత అంటే 20 రోజుల కోసం రూ.18 లక్షల డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది.

ఒకవేళ 20 రోజులకు మించి షూటింగ్ జరిగితే రోజుకి రూ.25000 చొప్పున ఇస్తానని నిర్మాత శ్యాంప్రసాద్ రెడ్డి తెలియజేసినట్టు సమాచారం. అయితే అరుంధతి సినిమా కోసం అనుకున్న దానికంటే ఎక్కువ రోజులు షూటింగ్ చేయవలసి వచ్చిందట. దీంతో సోనూసూద్ అప్పట్లోనే అరుంధతి సినిమా కోసం రూ .45 లక్షల రూపాయలు రెమ్యూనరేషన్ అందుకున్నట్లు సమాచారం.

Leave a Reply