చిరంజీవికి ఆ స్టార్ హీరోయిన్ అంటే మరీ అంత భయమా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో మహానటి సావిత్రి తర్వాత అంతటి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ ఎవరు అనగానే అందరికీ టక్కున గుర్తుకు వచ్చే పేరు నటి సౌందర్య. ఈ హీరోయిన్ అతి చిన్న వయసులో చనిపోయినప్పటికీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక చెరగని ముద్ర వేసుకుంది. ఎలాంటి గ్రామర్ ప్రాత్రల్లో నటించకుండా ఎక్స్పోజింగ్ చేయకుండా కేవలం తన నటనతోనే అందర్నీ కట్టిపడేసిన ఒకే ఒక హీరోయిన్ సౌందర్య. ఇండస్ట్రీ అంటేనే చాలామంది గ్లామర్ ఉంటేనే అవకాశాలు ఇస్తారు.

కానీ సౌందర్య ఎలాంటి ఎక్స్పోజింగ్ చేయకుండా కూడా ఆమెకు ఎన్నో అవకాశాలు ఇచ్చారు దర్శకనిర్మాతలు.సౌందర్య తన అందం, అభినయంతో ఎంతోమంది ప్రేక్షకులను కట్టిపడేసింది. అలాంటి సౌందర్య ప్రస్తుతం మన మధ్యన లేదు. ఆమెకు ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఎలాంటి చెడ్డ పేరు రాలేదు. కేవలం తన అమ్మానాన్నల దగ్గర ఒకే ఒక్క తప్పు పని చేసింది. అదేంటంటే తల్లిదండ్రులు కాదన్న అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంది.

ఆమె జీవితంలో చేసిన తప్పు అది ఒక్కటి మాత్రమే. ఇక ఈ విషయం పక్కన పెడితే సౌందర్య అంటే తెలుగులో ఉండే ఓ స్టార్ హీరో చాలా భయపడతారట. ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.మెగాస్టార్ చిరంజీవి సౌందర్య కు చాలా భయపడతారట. భయపడడం అంటే నిజ జీవితంలో నిజంగానే అనుకునేరు.ఆయన కేవలం సరదాగా అందరి ముందు ఆటపట్టించడానికి భయపడతారట.

సౌందర్య చిరంజీవి కాంబినేషన్లో ఎన్నో సినిమాలు వచ్చాయి.ఇక వీరిద్దరికీ హిట్ పేయిర్ అనే పేరు కూడా వచ్చింది.అలాంటి సౌందర్య చిరంజీవి కాంబినేషన్లో వచ్చిన అన్నయ్య అనే సినిమా షూటింగ్లో ఉన్నప్పుడు షూటింగ్ అయిపోయాక సెట్లో చిరంజీవి సౌందర్యను చాలా ఆటపట్టించే వారట.ఆమె సెట్ కి రాగానే ఆమెకు భయపడుతున్నట్టు మేడం వస్తుంది అందరూ లేచి నిల్చొండి అంటూ సరదాగా ఆట పట్టించే వారట.

అంతేకాదు ఆయన ముందు మేడం మేడం అని షూటింగ్ సెట్లో భయపడ్డట్టు ఆటపట్టించే వారట.ఇక ఈ విషయంలో సౌందర్య కూడా చిరంజీవిని ఎన్నోసార్లు ఆటపట్టించిందట. కానీ సౌందర్య చనిపోయినప్పుడు మాత్రం చిరంజీవి అస్సలు నమ్మలేదట. ఆమె చనిపోయింది అని అందరూ అనే వరకు ఆ విషయాన్ని ఆయన జీర్ణించుకోలేకపోయారట. ఇక సౌందర్య తో తనకున్న అనుబంధాన్ని సురేఖ దగ్గర పదేపదే చెప్పుకుంటూ చాలా ఎమోషనల్ అయ్యారట చిరంజీవి.

Leave a Reply