Bala krishna బాలకృష్ణ విగ్గుల కోసం ఎంత ఖర్చు చేస్తారో తెలుసా..?

ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో మంది హీరోలు సినిమాల్లో చాలా స్టైల్ గా కనిపిస్తూ ఉంటారు. అయితే కొంతమంది నిజమైన హెయిర్ తోనే సినిమాలు చేస్తే.. మరి కొంతమంది మాత్రం ఎక్కువగా విగ్గుల పైన ఆధారపడుతూ ఉంటారు అని చెప్పాలి. ఇలా టాలీవుడ్ లో విగ్గు ధరించి ప్రేక్షకులను అలరించే హీరోలలో నందమూరి హీరో బాలకృష్ణ కూడా ఉన్నారు.

ఇక ప్రతి సినిమాలో ఒకే రకమైన విగ్గు ధరిస్తూ బాలకృష్ణ తనకు నిజంగానే బట్టతల లేదేమో అనంతగా ప్రేక్షకులను నమ్మిస్తూ ఉంటారు అని చెప్పాలి. ఇకపోతే బాలకృష్ణ ధరించే విగ్గు ధర ఎంత ఉంటుంది అన్నది కూడా హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది.కాగా నందమూరి బాలకృష్ణ మేకప్ మెన్ వాసు కొప్పిశెట్టి ఇటీవల ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బాలకృష్ణ ధరించి విగ్గు గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

బాలకృష్ణ సినిమాల కోసం ధరించే విగ్గులను ఒక్కోసారి ముంబై నుంచి తీసుకొస్తాము అంటూ వాసు కొప్పిశెట్టి చెప్పుకొచ్చాడు. ఒక్కోసారి హైదరాబాదులో తీసుకుంటాం. ఇప్పుడు హైదరాబాద్ లోనే అదునాతనమైన విగ్గులు అందుబాటులోకి వచ్చేసాయి అంటూ తెలిపాడు. ఇక బాలకృష్ణ వాడే విగ్గుల ధర 3లక్షలు ఉంటుందని.. తక్కువ రకం విగ్గులు ఆయన వాడరని వాసు చెప్పుకొచ్చారు.

Leave a Reply