ఎన్టీఆర్ ని కృష్ణుడు విగ్రహంలా పెట్టడం యాదవ సంఘాలకు నచ్చడం లేదు..!

ఒకప్పుడు సినిమాలలో రకరకాల పాత్రలు పోషించి.. ఆ తర్వాత ఆ పాత్రలే వారికి అవకాశాలు లేకుండా చేస్తున్నాయి అని చెప్పడంలో సందేహం లేదు. అలా కొంతమంది ఇండస్ట్రీకి దూరమైతే మరికొంతమంది బుల్లితెరపై అవకాశాలు వెతుక్కుంటున్నారు. అలాంటి వారిలో కరాటే కళ్యాణి కూడా ఒకరు. ఒకప్పుడు తెలుగు సినీ ప్రేక్షకులకు ఈమె గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. నటిగా లేడీ కమెడియన్ గా భారీ పాపులారిటీ దక్కించుకున్న ఈమె బాబి అనే డైలాగ్ తో భారీ పాపులారిటీని దక్కించుకుంది.

ఎక్కువగా వ్యాంప్ క్యారెక్టర్లు పోషించిన కరాటే కళ్యాణి.. ఇటీవల అవకాశాలు తగ్గడంతో బిగ్ బాస్ లోకి అడుగుపెట్టింది. ఇక బిగ్ బాస్ ద్వారా మరింత పాపులారిటీ దక్కించుకున్న ఈమె సీరియల్స్ వైపు మొగ్గు చూపిందని చెప్పాలి. ఏదో ఒక వివాదంలో తలదూరుస్తూ కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన ఈమె ఇక అక్కడ అవకాశాలు లేకపోవడంతో బుల్లితెరపైకి అడుగు పెట్టింది.

అప్పుడప్పుడు పలు షోలలో దర్శనమిస్తూనే సీరియల్స్ లో తన నటనతో అలరిస్తోంది.తాజాగా తాజాగా సినీనటి కరాటే కళ్యాణి ఆధ్వర్యంలో ఖమ్మం నగర పాలక సంస్థ కార్యాలయం ముందు ఆధ్వర్యంలో హిందూ, యాదవ సంఘాల సభ్యులు ఆందోళన నిర్వహించారు. ఎన్టీఆర్‌కి విగ్రహం పెడితే అందరికీ సంతోషమే.. కానీ కానీ కృష్ణుడు రూపంలో పెట్టడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు చెప్పుకొచ్చారు.

భవిష్యత్ తరాల పిల్లలు ఎన్టీఆర్‌ని శ్రీకృష్ణుడు అనుకునే పరిస్థితి వస్తుందంటూ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దీని వెనక రాజకీయ ప్రయోజనం ఉందనే వాదన కూడా తెరపైకి వచ్చింది. యాదవ, కమ్మ సామాజిక వర్గం ఓట్లు కొల్లగొట్టేందుకే ఈ విగ్రహాన్ని పెడుతున్నారని ఆరోపిస్తున్నారు. భగవంతుడి రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహ ప్రారంభాన్ని మంత్రి పువ్వాడ నిలిపివేయాలనీ.. లేకపోతే అడ్డుకుంటామని హెచ్చరించారు.

Leave a Reply