Sreeleela | సినిమాలకు బ్రేక్ ఇచ్చిన శ్రీలీల.. అయోమయంలో నిర్మాతలు..

allroudadda

Sreeleela | తెలుగు చిత్ర పరిశ్రమలో కొన్నాళ్లుగా మార్మోగుతున్న పేరు శ్రీలీల. టాలీవుడ్లో ఎక్కువగా బిజీగా ఉన్న నటి ఆమెనే. యువ హీరోలతో పాటు టాప్ స్టార్ల వరకూ ఆమె చేతి నిండా సినిమాలు ఉన్నాయి. ఈ సంవత్సరం ఏకంగా స్కంద, ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్, భగవంత్ కేసరి, ఆదికేశవ.. నాలుగు సినిమాలతో ప్రేక్షకుల ముందుకి వచ్చింది. త్వరలోనే సంక్రాంతికి గుంటూరు కారం సినిమాని కూడా లైన్ లో పెట్టింది.శ్రీలీల బ్యాక్ టూ బ్యాక్ షూటింగ్స్ చేస్తోంది.

అయితే ఒకవైపు షూటింగ్స్ చేస్తూనే మరో వైపు ఎంబీబీఎస్(MBBS) చదువుతోంది. యాక్టింగ్ మీద ప్యాషన్ ఉన్నా తన ఎడ్యుకేషన్ ని కూడా అలాగే మెయింటెన్ చేస్తోంది. ఒక వైపు షూటింగ్స్ చేస్తూనే షూట్ గ్యాప్ లోమెడిసిన్ బుక్స్ చదువుకునే శ్రీలీల ఇప్పుడు కొన్నాళ్లు షూట్స్ కి బ్రేక్ ఇచ్చింది అని సమాచారం.

జనవరి వరకు కొన్ని కీలక ప్రాజెక్ట్స్..

allroudadda
allroudadda

మెడిసిన్ సెమిస్టర్ ఎగ్జామ్స్ ఉన్నాయని, వాటి కోసం కొన్ని రోజులు గట్టిగా ప్రిపేర్ అయి ఎగ్జామ్స్ రాయాలని అందుకే సినిమాలకు శ్రీలీల చిన్న బ్రేక్ ప్రకటించింది.తన పరీక్షల విషయం దర్శక, నిర్మాతలకు చెప్పి నవంబర్ నుంచి జనవరి వరకు కొన్ని కీలక ప్రాజెక్ట్స్ నుంచి శ్రీలీల బ్రేక్ తీసుకోనుందని సమాచారం. ప్రస్తుతం శ్రీలీల పరీక్షా కాలంలో ఉంది. అయితే, ఆయా చిత్రాల్లో ఆమె డేట్లను మార్చడం దర్శక, నిర్మాతలకు కూడా పరీక్షే కానుంది.

Leave a Reply