Sreeleela | ఫ్రెండ్ తో శ్రీలీల లిప్ లాక్.. అప్పుడే దొరికిపోయింది..

allroudadda

Sreeleela | మనం ఏదైనా మాట్లాడేటప్పుడు ముందు వెనుక చూసుకుని మాట్లాడాలని అంటుంటారు. మూట జారితే మళ్లీ తీసుకోవచ్చు కానీ.. మాట జారితే మాత్రం అస్సలు వెనక్కి తీసుకోలేము. ప్రస్తుతం అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటుంది టాలీవుడ్‌ లక్కీ హీరోయిన్‌ శ్రీలీల. రీసెంట్‌గా శ్రీలీల లిప్‌ లాక్‌ సీన్స్‌ గురించి మాట్లాడుతూ.. తను లిప్ లాక్ సీన్లు అస్సలు చేయనని, ఒకవేళ చేయాల్సి వస్తే తన భర్తతో మాత్రమే చేస్తానంటూ ఈ బ్యూటీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాను ఓ ఊపు ఊపేశాయి.

అయితే శ్రీలీల చేసిన కామెంట్స్‌పై కొందరు నెటిజన్లు తీవ్ర స్థాయిలో ట్రోల్స్‌ చేస్తున్నారు.శ్రీలీల నాలుగేళ్ల కిందట కన్నడలో కిస్‌ అనే సినిమా చేసింది. అందులో హీరోకు శ్రీలీలకు మధ్య ఓ గాఢమైన లిప్‌ లాక్‌ సీన్ ఉంటుంది. ఇక ఆ వీడియోను షేర్‌ చేస్తూ శ్రీలీలను నెటిజన్లు ఓ రేంజ్‌లో ఆడుకుంటున్నారు. దీన్ని లిప్‌ కిస్‌ అనరా మీ భాషలో అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

allroudadda
allroudadda

మరి కొందరైతే బహుశా శ్రీలీల భర్త ఇతనేనేమో అంటూ ట్రోల్స్ చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీలీల లిప్ కిస్‌ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఇక దీనిని శ్రీలీల ఫ్యాన్స్‌ ఖండిస్తున్నారు. కెరీర్‌ మొదట్లో తప్పని పరిస్థితుల్లో చేయాల్సి వచ్చిందని, ఆ తర్వాత ఒక్క సినిమాలోనూ లిప్‌ కిస్‌ సీన్‌ చేయలేదని కామెంట్స్ చేస్తున్నారు.ఇక ప్రస్తుతం శ్రీలీల టాలీవుడ్‌లో చక్రం తిప్పుతుంది. రెండు, మూడు కాదు ఏకంగా అరడజను సినిమాలను లైన్‌లో పెట్టింది.

Leave a Reply