బాలకృష్ణ పాటకు డాన్స్ తో అదరగొడుతున్న కాజల్, శ్రీ లీల..! వైరల్ వీడియో.

కొన్ని రోజుల క్రితం డైరెక్టర్ అనిల్ రావిపూడి నందమూరి బాలకృష్ణ యొక్క పాత సినిమాల్లో నుంచి ఒక పాట కు డాన్స్ చేసి ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. విపరీతంగా పాపులర్ అయిన ఆ వీడియో ద్వారా ఆయనకు బాలకృష్ణతో పనిచేస్తున్నందుకు తెలియజేశారు. అనిల్ రావిపూడి మరియు నందమూరి బాలకృష్ణ కలిసి భగవంత్ కేసరి అనే సినిమాను చేస్తున్నారు. హైదరాబాదులో వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా దసరాకు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

సంక్రాంతికి విడుదలైన వీర సింహారెడ్డి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన బాలకృష్ణ మరో పక్క మాస్ ఎంటర్టైనర్ తో రాబోతున్నారు. అయితే ఎప్పుడు కూడా కామెడీ కలగలిపిన సినిమాలను చేస్తూ ప్రేక్షకులను నవ్వించే మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న అనిల్ రావిపూడి, ఒక మాస్ సినిమాను ఎలా తీశారు అనేది చూడటానికి ఫ్యాన్స్ అందరూ కూడా చాలా ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు.

అయితే తాజాగా షూటింగ్ లొకేషన్లో శ్రీ లీల కాజల్ అగర్వాల్ బాలయ్య పాటకు డాన్స్ వేస్తూ డైరెక్టర్ అనిల్ రావిపూడి(Anil Ravipudi) ఓ రేంజ్ లో ఆడుకున్నారని తెలుస్తుంది. అనిల్ రావిపూడి బాలయ్య సాంగ్ కి డాన్స్ వేస్తాడు. బాలయ్య బాలయ్య గుండెల్లో గోలయ్య అనే సాంగ్ కి అనిల్ రావిపూడి తనదైన స్టైల్ లో చిందులేసాడు .కానీ తనకంటే ముందుగానే శ్రీ లీల కాజల్ అగర్వాల్ బాలకృష్ణ పాటకు డాన్స్ వేసి అనిల్ రావిపూడికి గట్టి షాక్ ఇచ్చారు.

బాలకృష్ణ నటించిన నరసింహనాయుడు(Narasimha Naidu) సినిమాలో చిలకపచ్చ కోక అనే పాటకు డాన్స్ ఇరగదీసారు. ఈ పాటలోని మొదటి రెండు లైన్లకు శ్రీ లీల కాజల్ యమహాట్ గా అదరగొట్టేశారు . “రారా ఉల్లాస వీరుడా”.. అంటూ జీన్స్ ప్యాంటు లోను చించేశారు . ఈ క్రమంలోనే అనిల్ వచ్చి సూపర్ అని చెప్పినప్పటికీ మా పాట ఇంకా పూర్తి కాలేదంటూ వీరిద్దరూ తిరిగి ఈ పాటకు డాన్స్ చేస్తూ అదిరిపోయే పర్ఫామెన్స్ ఇచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Leave a Reply