షాక్ శ్రీచైతన్య విద్యాసంస్థల చైర్మన్‌ కన్నుమూత..! కారణం ఇదే.

ఇంగ్లండ్‌, ఇరాన్‌లో డాక్టర్లుగా పనిచేసిన బీఎస్‌రావు దంపతులు 1986లో శ్రీచైతన్య విద్యాసంస్థలను స్థాపించారు. తొలుత విజయవాడలో బాలికల జూనియర్‌ కళాశాలను ప్రారంభించారు. విజయవాడ నుంచి విద్యాసంస్థలను అంచెలంచెలుగా విస్తరించారు.

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 321 జూనియర్‌ కళాశాలలు, 322 టెక్నో స్కూల్స్‌, 107 సీబీఎస్‌ఈ స్కూల్స్‌ ఉన్నాయి. శ్రీచైతన్య విద్యాసంస్థల్లో దాదాపు 8.5లక్షల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు.శ్రీ చైతన్య సంస్థల చైర్మన్ డాక్టర్‌ బిఎస్‌రావు కన్నుమూశారు.

అనారోగ్యంతో హైదరాబాద్‌లో బీఎస్‌ రావు మరణించారు. కాసేపట్లో బీఎస్ రావు భౌతికకాయాన్ని విజయవాడకు తరలించనున్నారు. కాగా రేపు విజయవాడలో బీఎస్‌ రావు అంత్యక్రియలు జరగనున్నాయి.

Leave a Reply