Sri Reddy | పెళ్లి చేసుకుంటానని నమ్మించి అది చేశాడు… శ్రీరెడ్డి

allroudadda

Sri Reddy | తెలుగులో ఒకప్పుడు పలు వివాదాలు, సంచలనాలతో ఇండస్ట్రీ లో బాగానే పాపులర్ అయిన ప్రముఖ తెలుగు నటి శ్రీ రెడ్డి గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు. అయితే నటి శ్రీ రెడ్డి అందరి నటీనటుల మాదిరిగానే ఇండస్ట్రీ లో అవకాశాలు దక్కించుకుని తన ప్రతిభ నిరూపించుకోవాలని వచ్చింది. కానీ దురుదృష్ట వశాత్తూ అవకాశాల పేరుతో కొంతమంది చేతిలో మోసపోయింది. ఈ క్రమంలో కొంతమేర ఆర్థికంగా అలాగే శారీరకంగా కొందరు నటి శ్రీ రెడ్డి ని వాడుకున్నారు. కానీ ఆఫర్ల విషయంలో మాత్రం శ్రీ రెడ్డి కి పెద్దగా న్యాయం జరగలేదు. దీంతో అప్పట్లో నటి శ్రీ రెడ్డి ఏకంగా రోడ్లపై అలాంటి ప్రదర్శనలు కూడా చేసింది.

దాంతో ఒక్కసారిగా ఈ అమ్మడు పాపులర్ అయిపోయింది..అయితే ఈ మధ్యకాలంలో నటి శ్రీరెడ్డికి సినిమా ఆఫర్లు పెద్దగా లేకపోవడంతో యూట్యూబ్ అలాగే ఫేస్బుక్ వంటి వాటిలో వంటల వీడియోలు చేస్తూ బాగానే ఆకట్టుకుంటుంది. ఈ నేపథ్యంలోనే లవ్ మ్యారేజ్ మంచిదా లేకపోతే అరేంజ్ మ్యారేజ్ మంచిదా అని అడగగా శ్రీ రెడ్డి మాత్రం పెద్దలు కుదిర్చిన వివాహమే చాలా మంచిది అని అంటుంది.

ఒకప్పుడు ప్రేమ వివాహాల్లో ప్రేమ మాత్రమే ఉండేది కానీ ఇప్పుడు ప్రేమ కాదు.కేవలం అట్రాక్షన్ మాత్రమే.ఆప్షన్స్ ఎక్కువ అయిపోవడం వల్ల ఎమోషనల్ గా వీక్ అయిపోతున్నారు.అందువల్ల ప్రేమ వివాహాలను నేను ప్రిఫర్ చేయను.కొన్ని రోజులు వాడుకొని మోజు తీరిపోయిన తర్వాత మోసం చేసి వదిలేస్తున్నారు.ఇలా రోజుకి ఇలా మోసపోయే వారి సంఖ్య పెరిగిపోతోంది అని తెలిపింది శ్రీరెడ్డి.హైదరాబాదులో ఒక అమ్మాయి జీవితం గురించి చూశాను ఆమె సింగిల్ పేరెంట్.

జబర్దస్త్ నరేష్ అసలు వయస్సు ఎంతో మీకు తెలుసా..?

ఆమె పెళ్లి కాకుండానే గర్భవతి అవ్వడంతో గర్భవతి అయిన తర్వాత నమ్మించి చివరికి ఆ కడుపు తీయించుకునే స్టేజ్ కూడా దాటిపోయింది.లోపల పిండాన్ని తీసేస్తే పెద్ద ప్రాణానికి ప్రమాదం అని చెప్పడం వల్ల ఆమె అలాగే ఉండిపోవాల్సి వచ్చింది.పెళ్లి కాకుండానే కడుపు రావడంతో ఆ అమ్మాయిని ఇంట్లో నుంచి తల్లిదండ్రులు తరిమేశారు.అలా అమ్మాయి అటు ఇటు కాకుండా అయిపోయింది అలా ఆమె జీవితాంతం ఆ మచ్చని మోస్తూనే ఉండాలి అని తెలిపింది శ్రీరెడ్డి.మోసపోయిన ఆ అమ్మాయి తన బాయ్ ఫ్రెండ్ నిలదీయగా, నేను ఏమి చేయలేని పరిస్థితి అంటూ చేతులు ఎత్తేసి సింపుల్ గా సారీ చెప్పేసాడట.అందువల్లే వెనక ముందు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి అని చెబుతోంది శ్రీ రెడ్డి.

Recent Posts

Leave a Reply