Srikanth Iyengar | ఆంద్రలో బూమ్ బూమ్ బీరు తాగ బతికి ఉంటే మళ్ళీ కలుద్దాం🤣..

Srikanth Iyengar | శ్రీకాంత్ అయ్యంగార్ అందరికీ సుపరిచితమే. ‘చమ్మక్ చల్లో’ చిత్రంతో నటుడిగా ఎంట్రీ ఇచ్చిన ఇతను.. ‘కిల్లింగ్ వీరప్పన్’ ‘ఇజం’ వంటి సినిమాలతో బాగా పాపులర్ అయ్యాడు. అటు తర్వాత ‘పైసా వసూల్’ ‘బ్రోచేవారెవరురా’ ‘డియర్ కామ్రేడ్’ ‘ప్రతి రోజు పండగే’ వంటి చిత్రాలతో బాగా ఫేమస్ అయ్యాడు. ఇతని డైలాగ్ డెలివరీ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఎలాంటి పాత్రలో అయినా అవలీలగా ఒదిగిపోతాడు. ఇప్పుడు వరుస ఆఫర్లతో బిజీగా గడుపుతున్నాడు.

మరోపక్క ఇతను సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటాడన్న సంగతి తెలిసిందే. తన శైలిలో పోస్టులు పెడుతూ వార్తల్లో నిలుస్తూ ఉంటాడు శ్రీకాంత్ అయ్యంగార్. ఆ మద్య ఇతను పెట్టిన ఓ వీడియో బాగా వైరల్ అవుతుంది. ఇందులో అతను ఏపీలో బీర్లపై సెటైర్లు వేశాడు.’ఈరోజు బెజవాడలో ఉన్నాను. డిప్రెషన్లో ఉండి బీరు తెచ్చుకున్నా. ఇది మామూలు బీరు కాదు. బూమ్ బూమ్ బీర్ అట. ఇంట్లో కూడా చెప్పలేదు.. తాగితే ఏమవుతుందో నాకు తెలీదు.

మరోపక్క ఇతను సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటాడన్న సంగతి తెలిసిందే. తన శైలిలో పోస్టులు పెడుతూ వార్తల్లో నిలుస్తూ ఉంటాడు శ్రీకాంత్ అయ్యంగార్. తాజాగా ఇతను పెట్టిన ఓ వీడియో బాగా వైరల్ అవుతుంది. ఇందులో అతను ఏపీలో బీర్లపై సెటైర్లు వేశాడు.’ఈరోజు బెజవాడలో ఉన్నాను. డిప్రెషన్లో ఉండి బీరు తెచ్చుకున్నా. ఇది మామూలు బీరు కాదు. బూమ్ బూమ్ బీర్ అట. ఇంట్లో కూడా చెప్పలేదు.. తాగితే ఏమవుతుందో నాకు తెలీదు.ఇక ఇదే విషయం మీద ఆయనని తాజాగా ఒక ఇంటర్వ్యూలో ప్రశ్నించగా ఆ విషయం మీద ఆయన ఘాటుగా స్పందించారు.

Also Read | చంద్రబాబుపై పోసాని సెటైర్లు.. సిగ్గు ఉండాలి అడగడానికి..

ఒక ఏపీ ప్రభుత్వ మద్దతుదారు తాను దారుణంగా బూతులతో తిట్టాడని, దమ్ముంటే విజయవాడ వచ్చి మందు తాగమని సవాల్ విసిరాడు అని అన్నారు. ఇక మణికొండ నుంచి కూకట్ పల్లి వెళ్లడానికి గంటన్నర పడుతుంది అంటే బీఆర్ఎస్ ను విమర్శించినట్టు కాదని అన్నారు. ఏ పని చేయడం రాని వాడే ఇలా కామెంట్లు పెట్టుకుంటూ బతుకుతాడని, పని ఉన్నవాడు పని చేసుకుంటాడని అన్నారు. ఇక ఆ కామెంట్లు పెడుతున్న వారిని పదేళ్ల తర్వాత రమ్మని ఏమి పీకుతాడో చూడాలి అని అంటూ ఆయన సవాల్ విసిరారు.

Leave a Reply