అప్పట్లో NTR చేతిరాత‌ చూస్తే అబ్బుర‌ప‌డాల్సిందే!!

తెలుగుజాతికి వన్నె తెచ్చిన అగ్రగణ్యుల్లో విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు ఒకరు.ఆయన పేరు వింటేనే ఆశేషమైన అభిమానం ఉప్పొంగుతుంది. తెలుగు ప్రజలను గర్వపడేలా ఆయన సినీ, రాజకీయ ప్రస్థానం సాగింది. ఎన్టీఆర్ సినిమాలు ఇప్పటికీ అందరి మదిలో నిలిచిపోతుంటాయి. ఆయన నటుడిగానే కాకుండా దర్శకనిర్మాత గాను వ్యవహరించారు.తన నటనా ప్రావీణ్యంతో ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్నారు.

కోట్లాది మంది తెలుగు ప్రజల అభిమానాన్ని చూరగొన్నారు.ఆయన తన జీవితంలో ఎక్కువ రోజులు సినిమాలు చేస్తూనే ప్రేక్షకులను అలరించారు.తాజాగా సోష‌ల్ మీడియాలో ఆయ‌న చేతిరాత వైర‌ల్ అవుతుంది. ముత్యాల్లాంటి అక్ష‌రాలు, ఎక్క‌డా త‌ప్పుల్లేని వాక్యాలు, ఓ ర‌చ‌యిత రాసిన‌ట్టుగా రాసిన‌ వ్యాఖ్యానాలు, వివ‌ర‌ణ‌లు… విజ‌య‌చిత్ర అనే ప‌త్రిక ద్వారా పాఠ‌కుల‌కు ఆయ‌న రాసిన లేఖ ఇది. 1966లో ఎన్టీయార్ ముఖచిత్రం ‘విజయచిత్ర’ద్వారా ప్రచురించబడింది.

దానికి మంచి రెస్పాన్స్ రావడంతో పాఠకుల కోసం ఓ లేఖ రాయాలని పబ్లిషర్ రావి కొండల రావు కోరగా అందుకు అన్నగారు ఓకే అన్నారట..మీ చేతి రాత బాగుంటుందని మీరు రాస్తే పాఠకులు సంతోషిస్తారని అనడంతో తప్పకుండా బ్రదర్ అని చెప్పారట.. అలా సినిమా షూటింట్‌లో దొరికిన ఖాళీ సమయంలో మూడు పేజీల్లో పాఠకుల కోసం తన కలం నుంచి పదాలను జారవిడిచారు. ఆనాటి ప్రతులు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎన్టీఆర్ రాతను చూసి నందమూరి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply