వద్దన్నా వినకుండా బేబమ్మ వెంట పడుతున్న స్టార్ హీరో కొడుకు.. ఎవరో తెలుసా?

డెబ్యూ సినిమాతోనే మంచి ఇమేజ్ను సొంతం చేసుకున్న కృతి శెట్టి అలియాస్ బేబమ్మ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మొదటి సినిమాతోనే మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ సరసన నటించే అవకాశాన్ని సొంతం చేసుకుని ఓవర్ నైట్ లోనే స్టార్ హీరోయిన్గా చలామణి అవుతోంది.

ఇక ఆ తర్వాత నానితో శ్యామ్ సింగరాయ్ , నాగచైతన్య తో బంగార్రాజు ఇప్పుడు రామ్ పోతినేని తో ది వారియర్ వంటి చిత్రాలతో బిజీగా దూసుకుపోతున్న ఈ ముద్దుగుమ్మ తెలుగులోనే కాదు కోలీవుడ్ ఇండస్ట్రీలో కూడా పలు ఆఫర్లను అందుకుంటోంది.

ఇకపోతే అటు టాలీవుడ్ , ఇటు కోలీవుడ్ లో బేబమ్మ కి డిమాండు మామూలుగా లేదని చెప్పవచ్చు. ఎందుకంటే స్టార్ హీరోలు కూడా తమ సినిమాలలో నటించడానికి బేబమ్మకు అవకాశం ఇస్తున్నారు. ఇక హీరో విశాల్ లాంటి హీరోలు కూడా ఆమెకు సమయం దొరికినప్పుడే తమ సినిమాలలో నటించమని చెప్పేంత ఆఫర్ కూడా ఇవ్వడం గమనార్హం.


ఇకపోతే తాజాగా ఓప్రమోషన్స్ లో భాగంగా పాల్గొన్న కృతి శెట్టి ఒక స్టార్ హీరో కొడుకు నుంచి ఇబ్బందులు తలెత్తుతున్నాయని మీడియా ముందు వెల్లడించింది.ఇక కోలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఒక బడా హీరో కొడుకు బేబమ్మకి ఉన్న పాపులారిటీని చూసుకొని ఆమెకు ఒక బంపర్ ఆఫర్ ప్రకటించారట.

అంతేకాదు కళ్ళు చెదిరే అమౌంట్ ఇస్తానని ..తన బర్తడే పార్టీకి రమ్మని కూడా పిలిచాడట. అయితే ఆ కుర్ర హీరో హద్దులు మీరి ప్రవర్తిస్తుండడంతో కొంచెం అలర్ట్ అయిన బేబమ్మ అతడిని కూడా ఇబ్బంది పెట్టకుండా సైలెంట్ గా నో చెప్పి కాల్ కట్ చేసిందని సమాచారం.

ఇక ఆ స్టార్ హీరో కొడుకు కోలీవుడ్ లో బాగా పాపులారిటీ తెచ్చుకున్న వారేనట. బేబమ్మ చేసిన పనికి ప్రతి ఒక్కరు శభాష్ అంటూ మెచ్చుకుంటున్నారు.. ఆఫర్లకు లొంగకుండా తన వ్యక్తిత్వాన్ని నాశనం చేసుకోకుండా బేబమ్మ తీసుకున్న ఈ నిర్ణయానికి ప్రతి ఒక్కరు శభాష్ అనడం గమనార్హం.

Leave a Reply