Aishwarya Rajesh | ఐశ్వర్య రాజేష్ కష్టాలు తెలిస్తే కన్నీళ్లు ఆగవు

allroudadda

Aishwarya Rajesh | ప్రస్తుతం సౌత్ లో నటనతో గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్లలో ఐశ్వర్య రాజేష్ కూడా ఒకరు. కేవలం నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలలో నటిస్తూ ఐశ్వర్య రాజేష్ అభిమానులను సంపాదించుకుంటుంది. తెలుగుతోపాటు తమిళ్ లో ఐశ్వర్య రాజేష్ పలు చిత్రాలలో నటిస్తోంది. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలో తన నటనతో ఆకట్టుకుంది.అదేవిధంగా రిపబ్లిక్, టక్ జగదీష్, భీమ్లా నాయక్ చిత్రాల్లో మంచి పాత్రలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది.

ఇదిలా ఉంటే ఐశ్వర్య రాజేష్ తండ్రి ఒకప్పటి హీరో అన్న సంగతి చాలా మందికి తెలియదు. టాలీవుడ్ తో పాటూ కోలీవుడ్ లో రాజేష్ హీరోగా మంచి గుర్తింపు సాధించారు. కానీ ఆయన చిన్న వయసులోనే అనారోగ్యంతో కన్నుమూశారు.ఇక రాజేష్ సోదరి శ్రీలక్ష్మి లేడీ కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కాగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో శ్రీ లక్ష్మీ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

allroudadda
allroudadda

తన సోదరుడు , ఐశ్వర్య రాజేష్ తండ్రి రాజేష్ తీవ్ర అనారోగ్యంతో మృతి చెందాడని చెప్పారు. అంతేకాకుండా ఐశ్వర్య రాజేష్ కు ఇద్దరు అన్నలు కూడా ఉండేవారని తెలిపారు. ఇద్దరూ 20 ఏళ్ల వయసు ఉన్నప్పుడే మృతి చెందారని తెలిపారు. వారిలో ఒకరు ఓ అమ్మాయిని ప్రేమించడానికి తెలిపారు. ఏం జరిగిందో కానీ అమ్మాయితో పాటు అతడు కూడా గదిలో ఆ++ త్మ++ హత్య చేసుకున్నాడని చెప్పారు.

allroudadda
allroudadda

ఇక మరో అన్న 20 ఏళ్ల వయసులోనే బైక్ ఆక్సిడెంట్ లో కన్నుమూసాడని వెల్లడించారు. ఇలా వరుస విషాదాలతో ఐశ్వర్య రాజేష్ చిన్న వయసులోనే జీవితంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొందని పేర్కొన్నారు. ఇండస్ట్రీలో ఎలాంటి సపోర్ట్ లేకపోయినా తన కాళ్లపై తాను నిలబడుతూ ఐశ్వర్య ఈ స్థాయికి వచ్చిందని వెల్లడించారు.

కొడాలి నానిపై వంగలపూడి అనిత షాకింగ్ కామెంట్స్..!

Leave a Reply