మీ ప్రేమ వివాహం విజయవంతం కావాలంటే ఇలా చేస్తే చాలు ..?

ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. ప్రేమను పెళ్లి వరకు తీసుకురావాలని ప్రతి ఒక్కరూ చూస్తుంటారు. ఇలా జరగాలంటే కొన్ని జ్యోతిష నియమాలు తప్పకుండా పాటించాలి. ప్రేమ వివాహంలో కొన్ని సార్లు అమ్మాయి తల్లిదండ్రులు.. అబ్బాయి కుటుంబంతో పెళ్లి జరిపేందుకు సిద్ధంగా ఉండకపోవచ్చు. ఇందుకు సమాజం ప్రధాన కారణమైతే. మరికొన్నిసార్లు కులం, మతం, ఆస్తి-పాస్తులు లాంటి అంశాలు అడ్డుగా వస్తాయి.

ఐతే ప్రేమ వివాహం విజయవంతం కావాలంటే డైమండ్ లేదా ఓపల్ రత్నాన్ని ధరించండి. 16 సోమవారాల పాటు ఉపవాసం చేయండి. ఈ రత్నాలు మీ ప్రేమను పెళ్లి వరకు తీసుకెళ్లడంలో సహాయపడతాయి. అంతేకాకుండా సోమవారం ఉపవాసం ఉండటం వల్ల శివుడి అనుగ్రహం మీకు కలుగుతుంది. తద్వారా పెళ్లికి సంబంధించి మీకు ఎలాంటి సమస్యలు ఎదురుకావు.

ప్రతిరోజూ “ఓం గౌరీ శంఖర అర్ధాంగిని తవాం శంకర్ ప్రియా మామ్ కురు కల్యాణి కాంత సుదుర్లుభం” అనే మంత్రాన్ని జపించాలి.వ్యక్తుల జాతకంలో ఐదు, ఏడో స్థానాల్లో వివాహం స్థానం ఉంటుంది. ఐదో ఇంటికి అధిపతి చంద్రుడు. ఏడో పాదానికి అధిపతి సప్తముడు. ఈ యోగం ఏర్పడినప్పుడు ప్రేమ వివాహం జరుగుతుంది. ఇందుకోసం మీరు పంచమ స్థానానికి అధిపతి అయిన చంద్రుడిని సంతృప్తి పరచేందుకు ముత్యాలు ధరించాలి. ఇలా చేయడం ద్వారా జాతకం సక్రమంగా మారి ప్రేమ వివాహం జరుగుతుంది. ఫలితంగా మీ కోరిక నెరవేరుతుంది.

Leave a Reply