Election Campaign | పిఠాపురం ప్రచారంలో సుడిగాలి సుధీర్.. ఈ సారి గెలుపు అన్నదే అంటూ..

allroudadda

Election Campaign | జనసేన స్టార్ క్యాంపెయినర్లు రంగంలోకి దిగారు. పవన్ కల్యాణ్  Pawan Kalyan ని సీఎం చేయడానికి తామంతా సిద్ధం అంటూ అంబటి రాయుడు ఆల్రడీ ట్విట్టర్లో మంచి కామెడీ పంచారు. మొన్న జబర్దస్త్ నటుడు హైపర్ ఆది ప్రచారంలో జోకులు పేల్చారు. పవన్ కల్యాణ్ గెలుపుతో పిఠాపురం వరల్డ్ ఫేమస్ అవుతుందని, ప్రపంచంలోని తెలుగువారంతా ఇక్కడికి క్యూ కట్టుకుని వస్తారని అన్నారు.

ప్రస్తుతం హైదరాబాద్ కి జనం ఎలా వస్తున్నారో.. రేపు పిఠాపురం కూడా జనం తండోపతండాలుగా వస్తారని చెప్పారు హైపర్ ఆది.ఏపీలో ఎన్నికలయ్యేవరకు తాము షూటింగ్ లు కూడా క్యాన్సిల్ చేసుకున్నామని చెప్పారు హైపర్ ఆది. ప్రస్తుతం జనసేన కోసం తాము షూటింగ్ లు అన్నీ ఆపేసి వచ్చామన్నారు. 21మంది అభ్యర్థుల గెలుపుకోసం జనంలోకి వెళ్తున్నామని చెప్పారు.

allroudadda
allroudadda

ముఖ్యంగా పవన్ కల్యాణ్ పిఠాపురంలో స్టార్ క్యాంపెయినర్లు విస్తృతంగా పర్యటిస్తారని అన్నారు హైపర్ ఆది.ఇక ఇప్పటికే గెటప్ శ్రీను, హైపర్ ఆది, జానీ మాస్టర్, నిర్మాతలు ఎస్కేఎన్, బన్నీ వాసు వంటి వాళ్ళు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటుండగా ఇప్పుడు మరో స్టార్ కమెడియన్ కూడా అందులో జాయిన్ అయ్యాడు.

ఆ వెదవ రూమ్ బుక్ చేస్తా.. వస్తావా అన్నాడు.. వరలక్ష్మి శరత్ కుమార్

అతను ఎవరో కాదు బుల్లితెరలో మంచి క్రేజ్ తెచ్చుకున్న సుడిగాలి సుధీర్. ఈ రోజు ఎన్నికల ప్రచారంలో సుడిగాలి సుధీర్, గెటప్ శీను పాల్గొననున్నారు. ఈ క్రమంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీపాద శ్రీ వల్లభ దేవస్థానాన్ని జబర్దస్త్ ఫ్రేమ్ సుడిగాలి సుధీర్, గెటప్ శీను దర్శించుకున్నారు. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు యు కొత్తపల్లి మండలంలో 15 గ్రామాల్లో పవన్ కళ్యాణ్ తరపున ప్రచారం నిర్వహించనున్నారు.

Leave a Reply