నటి సుజాత నిజ జీవితంలో మరువలేని విషాదం.. ఇదేనా?

నటి సుజాత (Sujatha)గురించి ఈ తరం ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఈమె ఎక్కువగా నటించలేదు. కానీ ముందు తరం ప్రేక్షకులకు ఈమె ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. వెంకటేష్ చంటి సినిమాలో అతనికి తల్లి పాత్రలో నటించిన నటిగా కొంతమేర గుర్తింపు తెచ్చుకుంది. ఈమె టాలీవుడ్ లోనే సీనియర్ మోస్ట్ హీరోయిన్ అని చెప్పాలి. అక్కినేని నుంచి శోభన్ బాబు వరకు ప్రతి ఒక్కరితో కూడా కలిసి నటించింది..

సుజాత స్వతహాగా మలయాళీ అయినప్పటికీ కూడా శ్రీలంకలో పుట్టి.. అక్కడే పెరిగి పెద్దదయింది. ఆ తర్వాత అనుకోకుండా తమిళ్ సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టి అక్కడ స్టార్ హీరోయిన్గా ఎదిగింది. తమిళం తో పాటు తెలుగు ,మలయాళం, కన్నడ ,తమిళ చిత్ర పరిశ్రమలో ఆమె తిరుగులేని నటిగా దాదాపు రెండు దశాబ్దాల కాలం పాటు ఏకచత్రాధిపత్యం చేసింది. వయసు పెరిగే కొద్దీ వయసుకు తగ్గ క్యారెక్టర్ లో నటిస్తూ ప్రేక్షకులను అలరించింది.

ఆ తర్వాత తల్లిపాత్రలకు పరిమితం అవుతూ ప్రేక్షకులను అలరించిన ఈమె తెలుగులో చివరిసారిగా శ్రీరామదాసు అనే సినిమాలో కనిపించింది.అయితే తమిళంలో ఆమె ఎక్కువగా నటించడానికి కారణం అగ్రశ్రేణి దర్శకుడైన బాలచందర్ (Balachandar) అని చెప్పవచ్చు . బాలచందర్ ఎక్కువగా ఆమెను తన సినిమాలలో హీరోయిన్గా తీసుకొని ప్రోత్సహించేవారు. ఇందుకు గల కారణం ఏమిటి అంటే బాలచందర్ దగ్గర సుజాత అసిస్టెంట్ డైరెక్టర్గా కూడా పనిచేసిన విషయం బహుశా చాలామందికి తెలియదనే చెప్పాలి.

ఒకానొక దశలో వీరిద్దరు ప్రేమాయణం కూడా కొనసాగిస్తున్నారని ఇండస్ట్రీ మొత్తం కూడా కూసింది. కానీ ఏమైందో తెలియదు కానీ ఆమెను పెళ్లి చేసుకోలేదు. కానీ బాలచందర్ హీరోయిన్గా మాత్రం ఆమె పాపులారిటీ దక్కించుకుంది.బాలచంద్ర పై ఉన్న అభిమానంతోనే చాలా సంవత్సరాలు ఆమె పెళ్లి కూడా చేసుకోలేదు. కానీ లేటు వయసులో పెళ్లి చేసుకుని సినిమా ఇండస్ట్రీకి కొంతకాలం దూరమై ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంది. దాంతో మళ్లీ సినిమాలలో బిజీ అవ్వాలని ప్రయత్నిస్తోంది.

Leave a Reply