గాయాల పాలైన సుమ…షాక్ లో ఆభిమానులు.. అసలు ఏం జరిగింది అంటే..?

సుమ ప్రస్తుతం బుల్లితెరపై బాగా బిజీగా ఉంది. ఇక సుమ(Suma)మాటలు వింటే మాత్రం ఎవరైనా కరగాల్సిందే. తను వేసే పంచులు కూడా ఇతరులను నొప్పించకుండా ఉంటాయి. పైగా అందరిని ఎలా కనెక్ట్ చేసుకోవాలో సుమకు తెలుసు. సుమ అంటేనే మంచి ఎంటర్టైన్మెంటర్. ఇతర భాషలకు చెందిన సెలబ్రెటీలను కూడా సుమ ఒక రేంజ్ లో ఆట ఆడిస్తుంది.

ఇక సుమ సోషల్ మీడియా లో కూడా బాగా యాక్టివ్ గా కనిపిస్తూ ఉంటుంది. అయితే ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గా సుమ (Suma) వెకేషన్ ట్రిప్ కి వెళ్లి అక్కడ మంచు కొండలలో బాగా ఎంజాయ్ చేసినట్లు కనిపించింది. ఇక వాటికి సంబంధించిన కూడా ఫొటోస్ పంచుకుంది.

అయితే తాజాగా తను ఒక ఫోటో షేర్ చేసుకోగా అందులో తన పాదాలకు గాయమైనట్లు కనిపించింది. దీంతో తను మంచు కొండలలో బాగా ఆడినందుకు ఇలా అయిందేమో అని తన అభిమానులు అనుమానం పడుతున్నారు. అయితే మరి కొంతమంది ఆమెకు తగిలిన గాయాన్ని చూసి ట్రోల్స్ చేస్తున్నారు.

Leave a Reply