Hero Suman:  సుమన్ భార్య ఎంత అందంగా ఉంటుందో తెలుసా.. ? వైరల్ అవుతున్నఫోటోలు..!

టాలీవుడ్ హీరో సుమన్ గురించి ఆయనకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో సినిమాల్లో హీరోగా నటించి అప్పట్లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నారు. ముఖ్యంగా ఎక్కువ లేడీ ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరో ఇతనే. ఆ రోజుల్లో సుమన్ అంటే పడి చచ్చే వారు లేడీ అభిమానులు. మన రాష్ట్రం కాకపోయినా తెలుగు ప్రేక్షకులకు తన సినిమా ద్వారా , నటన ద్వారా ఎంతగానో చేరువయ్యాడు.

సినిమా పరంగా ఆయన ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా విలన్ గా చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే.వ్యక్తిగత జీవితానికి వెళితే 1959 ఆగష్టు 28న మద్రాసులో జన్మించిన సుమన్ నటన మాత్రమే కాకుండా కరాటేలో కూడా ఉత్తీర్ణత సాధించారు. కరాటే మాస్టర్ గా కొన్ని రోజులు పని చేసిన తర్వాత ఆయన ను కుటుంబ స్నేహితుడు కిట్టు ఒక తమిళ నిర్మాతకు పరిచయం చేశారు.

1977 లో నటించిన తమిళ సినిమా నీచల్ కులం తో సినీ రంగంలోకి అడుగుపెట్టి ఆ తర్వాత వరుస సినిమాలు చేసుకుంటూ స్టార్ గా ఎదిగాడు. తొలి సినిమాలో పోలీసు అధికారి పాత్రలో నటించి టాప్ హీరోగా ఎదిగాడు.ఆ తర్వాత కన్నడ నుంచి ఇక్కడికి వచ్చి జెండా పాతాడు. అన్ని భాషలలో కలిపి ఆయన దాదాపు 150కి పైగా చిత్రాలలో నటించారు. ఒకానొక సమయంలో నెంబర్ వన్ పీఠం కోసం చిరంజీవి తో పోటీ పడ్డాడు సుమన్.

ఆ తర్వాత జరిగిన కొన్ని పరిణామాల తో సుమంత్ కెరీర్ ఒక్కసారిగా తిరగబడింది. జైలుకు వెళ్లడం, సినిమాలు పెద్దగా హిట్ కాకపోవడం వంటి కారణాలు ఆయనను వెనక్కి నెట్టాయి.

ఇక ఆయన శిరీష అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు టాలీవుడ్ లెజెండరీ రైటర్ అయినా నరసరావు మనవరాలు అవుతుంది శిరీష. వీరికి ఓ కూతురు కూడా ఉంది. సోషల్ మీడియాలో వీరి పెళ్లి కి సంబంధించిన కొన్ని ఫోటోలు వైరల్ గా మారాయి.

Leave a Reply