హీరో సుమన్ భార్య బ్యాక్ గ్రౌండ్ హిస్టరీ తెలిస్తే మీ మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే,

స్టార్ హీరోలుగా ఎద‌గాల్సిన కొంత‌మంది హీరోల కెరీర్ అనేక కార‌ణాల వ‌ల్ల ఇబ్బందుల్లో పడింది. దాంతో ఎంతో టాలెంట్ అందం ఉన్నా స్టార్స్ గా ఎద‌గ‌లేక‌పోయారు. అలాంటి హీరోల లిస్ట్ లో సుమ‌న్ కూడా ఉన్నారు. హీరో సుమ‌న్ త‌న అందం తో ఎంతో మంది అభిమానుల‌ను సంపాదించుకున్నారు. త‌మిళ హీరో అయిన‌ప్ప‌టికీ టాలీవ‌డ్ లో సుమ‌న్ కు ఎంతో క్రేజ్ ఉంది.ఒక‌ప్పుడు సుమ‌న్ టాలీవుడ్ లో చిరంజీవికి పోటీ ఇచ్చారు అంటే ఆయ‌న రేంజ్ ఎంటో అర్థం చేసకోవ‌చ్చు. యాక్ష‌న్ సినిమాల‌తో పాటూ కుటుంబ క‌థా చిత్రాల‌తో సుమ‌న్ ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌ర‌య్యారు.త‌రంగిణి సినిమాతో తెలుగులో అడుగుపెట్టి న‌ట‌న‌తో ఆక‌ట్టుకున్నారు.

అంతే కాకుండా భ‌క్తి ర‌స చిత్రాల‌తో కూడా సుమ‌న్ ప్రేక్ష‌కుల‌ను మెప్పించారు. త‌న అందం వ‌ల్ల సుమ‌న్ కు లేడీ ఫాలోయింగ్ ఎక్కువ‌గా ఉండేది.ఇక ఫైట్స్ సంగతి అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..కరాటే లో బ్లాక్ బెల్ట్ సాధించిన వాడు ఈయన..సినిమాల్లోకి రాకముందు ఈయన కరాటే టీచర్ గా కూడా కొన్ని స్కూల్స్ లో పని చేసాడు..అలా వెండితెర మీద ఈయన చేసే పోరాట సన్నివేశాలకు ప్రేక్షకులు థియేటర్స్ లో విజిల్స్ వేసేవారు..

అంతలా ఇండస్ట్రీ దూసుపోతున్న సుమన్ కెరీర్ జైలు పాలైంది..బ్లూ ఫిలిమ్స్ తీస్తున్నాడు అనే కేసు లో సుమన్ ని ఎవరో కావాలని ఇరికించి ఆయన జీవితాన్ని నాశనం అయ్యేలా చేసారు.ఇప్పుడు ఆయన వ్యక్తిగత జీవితం గురించి..ఆయన జీవిత భాగస్వామి గురించి మీకెవ్వరికి తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు మీ ముందు ఉంచబోతున్నాము.. టాలీవుడ్ లెజండ‌రీ రైట‌ర్ బ‌స‌వ‌రాజు త‌న మ‌న‌వ‌రాలికి ఇచ్చి వివాహం జ‌రిపించారు.

ఇండ‌స్ట్రీలో ఈ విష‌యం హాట్ టాపిక్ గా మారింది,సుమ‌న్ నిర్దోషి కాబ‌ట్టే బ‌స‌వ‌రాజు త‌న మ‌న‌వ‌రాలితో వివాహం జ‌రిపించార‌ని అంతా అనుకున్నారు. పెళ్లి త‌ర‌వాత సుమ‌న్ జీవితం మ‌ళ్లీ ప‌ట్టాలెక్కింది.పెళ్లి త‌ర‌వాత సుమ‌న్ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. బావ‌బావ‌మ‌రిది, పెద్దింటి అల్లుడు సినిమాల‌తో సూప‌ర్ హిట్స్ అందుకున్నాడు. ఇక సుమ‌న్ త‌న భార్య పేరు శిరీష త‌ల్వార్ కాగా ఆమె చాలా మంచిద‌ని త‌న వ‌ల్లే తాను ఈ స్థాయిలో ఉన్నాన‌ని చెప్పారు. సుమ‌న్ శిరీష‌ల‌కు ఓ కూతురు ఉంది. ఇక సుమ‌న్ జీవితం ఎంతో మందికి ఆద‌ర్శం అని చెప్ప‌వ‌చ్చు.

Leave a Reply