Sundeep Kishan | నా ఆర్థిక చాలా పరిస్థితి దారుణంగా ఉంది.. అందుకే ఆ పని చేస్తున్నా..

allroudadda

Sundeep Kishan | సందీప్ కిషన్ లేటెస్ట్ మూవీ ‘ఊరి పేరు భైరవకోన’ ఫిబ్రవరి 16న గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది. వీఐ ఆనంద్ డైరెక్ట్ చేసిన ఈ ఫాంటసీ మూవీలో వర్ష బొల్లమ్మ, కావ్య తాపర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. కాగా హీరో సందీప్ కిషన్ ఈ సినిమా ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నారు. ఈ సందర్భంలో తన బ్రేకప్ స్టోరీలతో పాటు.. పెళ్లి గురించి ఆసక్తికరమైన కామెంట్స్ చేసారు.సందీప్ కిషన్ ముగ్గుర్ని లవ్ చేసారట.

ఫస్ట్ లవ్ నాలుగేళ్లు.. సెకండ్ లవ్ రెండేళ్లు.. థర్డ్ లవ్ రెండున్నరేళ్లు నడిచాయట. అయితే ఏది వర్కవుట్ కాలేదని చెప్పారు సందీప్. తను ప్రేమించిన వారంతా ఇండస్ట్రీకి చెందిన వ్యక్తులే అని.. వాళ్ల గురించి ఎవరికీ తెలియదని బయటకు రాకుండా తాను చాలా కేర్ ఫుల్‌గా ఉంటానని సందీప్ చెప్పారు. ప్రస్తుతానికి పెళ్లి చేసుకునే ఆలోచన లేదన్నారు.. ఇటీవల కాలంలో చాలా పెళ్లిళ్లు నిలబడట్లేదని.. పెళ్లి చేసుకుంటే జీవితకాలం కలిసి ఉండాలని.. పెళ్లి విషయంలో నిర్ణయం తీసుకోవాలంటే చాలా ఆలోచించాలని సందీప్ కిషన్ చెప్పుకొచ్చారు.

allroudadda
allroudadda

అలాగే సెలబ్రిటీలు అంటే.. ఏదో అనుభవించేస్తున్నారు.. బోల్డంత ఆస్తి ఉంటుంది.. వాళ్ళకేంటి అనుకుంటారు కానీ, వాళ్ళకుండే అప్పులు వాళ్లకు ఉంటాయి.వాళ్ళకుండే సమస్యలు వాళ్లకు ఉన్తయి. అవి వారు బయటపెట్టినప్పుడు మాత్రమే తెలుస్తాయి. అప్పుడు.. అరెరే అవునా.. ఏ హీరో ఇన్ని ఇబ్బందులు పడుతున్నాడా.. ? అని అనుకుంటారు. తాజాగా కుర్ర హీరో సందీప్ కిషన్ గురించి కూడా అభిమానులు అలానే అనుకుంటున్నారు.

Rajamouli | ఎన్టీఆర్ ఇచ్చిన గిఫ్ట్ చూసి షాక్ అయిన రాజమౌళి..!

మొదటిసారి సందీప్.. తాను ఆర్థిక పరిస్థితి బాలేదని చెప్పడం హాట్ టాపిక్ గా మారింది. సాధారణంగా ఒక కుర్ర హీరో.. తన సినిమాలతో పాటు వేరే హీరో సినిమాలలో గెస్ట్ రోల్స్ చేస్తున్నాడు అంటే.. మూడు కారణాలు ఉంటాయి. ఒకటి ఆ హీరోతో ఉన్న స్నేహం.. రెండు కథ బాగా నచ్చడం.. మూడోది డబ్బు లేక. ఇక సందీప్ కూడా డబ్బు లేకనే గెస్ట్ రోల్స్ చేస్తున్నట్లు అధికారికంగా చెప్పుకొచ్చాడు.

Recent Posts

Leave a Reply