Ram Charan: ఉపాసనపై సునిశిత్ చెత్త కామెంట్లు.. చితకబాదిన మెగా ఫ్యాన్స్..! వీడియో వైరల్

శాక్రిఫైజ్ స్టార్ సునిశిత్ గుర్తున్నాడా ? యూట్యూబ్ వీడియోలను చూస్తూ… నిత్యం నెట్టింట్లో మునిగితేలేవారికి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్ స్టార్స్ పై ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేస్తూ.. నిత్యం వార్తల్లో నిలిచేవాడు.. ముందు ఆ సినిమా ఛాన్స్ నాకే వచ్చింది.. కానీ.. ఆ స్టార్ హీరో అడిగితే ఆఫర్ ఇచ్చేసా.. ఆ హీరోయిన్‍తో నాకు పెళ్లైంది.. ఎఫైర్ ఉందని,.. తను ఇప్పటివరకు ఇన్ని సినిమాలు చేశానని వివాదాస్పద వ్యాఖ్యలు చేసేవాడు.

అంతేకాదు.. ఈ సోది స్టార్‏ను ఎన్నో ఛానల్స్ ఇంటర్వ్యూ చేసి అంతా కలసి అప్పట్లో నెట్టింట్లో రచ్చ చేశారు. అయితే ఈ సోదీ స్టార్ గురించి సినీ ప్రముఖులు పెద్దగా పట్టించుకోలేదు. అయినా.. కొందరు హీరోయిన్స్ రియాక్ట్ అయ్యి.. తమపై అసత్య ప్రచారం చేస్తున్న సునిశిత్ పై కేసు పెట్టారు. ఆ తర్వాత శాక్రిఫ్రైజ్ స్టార్ పత్తా లేకుండా పోయాడు.తాజాగా ఒక యూట్యూబ్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సునిశిత్ మాట్లాడుతూ.. “ఉపాసన నాకు ఫ్రెండ్.

ఆమెకు ఒక ఎలెక్ట్రిక్ కారు ఉంది. ఆ కారులో మేమిద్దరం గోవా కూడా వెళ్లాం” అంటూ కామెంట్ చేసాడు. ఇదంతా మెగా ఫ్యాన్స్ వింటున్నారు అనవసరంగా తన్నులు తింటారు అంటూ యాంకర్ వార్నింగ్ ఇచ్చింది.”లేదు నన్ను ఎవరూ కొట్టరు. ఎందుకంటే రాంచరణ్ కూడా నాకు ఫ్రెండ్. ఉపాసనతో నార్మల్ గా చాట్ చేస్తుంటే.. రాంచరణ్ స్వయంగా ఉపాసనని పడేయ్ అని తనతో చెప్పాడని సునిశిత్ తీవ్రమైన వ్యాఖ్యలు చేశాడు.

దీంతో ఆగ్రహించిన చరణ్ ఫ్యాన్స్ సునిశిత్ ను చితకబాదారు. అనంతరం సునిశిత్ తో క్షమాపణ చెప్పించారు.”ఒక ఇంటర్వ్యూలో నేను ఉపాసన గారి గురించి తప్పుగా మాట్లాడానని, ఇక మీదట ఏ సెలెబ్రిటీ గురించి తప్పుడు వ్యాఖ్యలు చేయనని, ఉపాసన వదినమ్మ గారికి, రాంచరణ్ క్షమాపణ కోరుతున్నా అని చెప్పుకొచ్చాడు సునిషిత్. ఇక చరణ్ ఫ్యాన్స్ సునిశిత్ ను కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Leave a Reply